Elections In Three States : కేంద్ర ఎన్నికల సంఘం (CEC).. మరోసారి ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిపేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. జమ్మూ కాశ్మీర్‌తోపాటు దేశంలో అసెంబ్లీ పదవీ కాలం ముగియనున్న మరో మూడు రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు.. ఆగస్టు 20 వ తేదీ నాటికి.. ఓటర్ల జాబితాలో సవరణ ప్రక్రియను పూర్తి చేసి.. తుది జాబితాను సిద్ధం చేయాలని అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ఆ 3 రాష్ట్రాలతోపాటు జమ్మూ కాశ్మీర్‌లోని ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Elections : జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు
జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. కాశ్మీర్ ఎన్నికలను సెప్టెంబర్ 30 వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది.
Translate this News: