Global Military Ranks: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ విడుదల..టాప్ లో అమెరికా..లాస్ట్ భూటాన్..మరి భారత్ ర్యాంక్ ఎంత?

ప్రపంచ దేశాల శక్తి సామర్థ్యాల ర్యాంకులను గ్లోబల్ ఫైర్ పవర్ రిలీజ్ చేసింది. ఇందులో అమెరికాలో మొదటి స్థానంలో ఉండగా..భూటన్ చివరి స్థానంలో నిలించింది. ఇక భారత్ ఈ ర్యాకింగ్ లో నాలుగో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది.

Global Military Ranks: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ విడుదల..టాప్ లో అమెరికా..లాస్ట్ భూటాన్..మరి భారత్ ర్యాంక్ ఎంత?
New Update

Global Military Ranks: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకులు రిలీజ్ అయ్యాయి. గ్లోబల్ ఫైర్ పవర్స్ మిలిటరీ(Global Fire Powers Military) స్ట్రెంథ్ ర్యాకింగ్స్ 2024 పేరుతో రిపోర్టును గ్లోబల్ ఫైర్ రిలీజ్ చేసింది. మొదటి 145 దేశాల సైనిక శక్తి సామర్థ్యాలను ర్యాంక్ లుగా తేల్చింది. సైనికుల సంఖ్య ఆయుధాలు, ఆర్థిక స్థిరత, భౌగోళిక స్థితి, వనరులు వంటి 60కిపైగా అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించింది.

కాగా ఈ ర్యాంకుల్లో అమెరికా(America) మొదటి స్థానంలో నిలవగా..ఆ తర్వాత రష్యా...మూడోస్ధానంలో చైనా...భారత ఆర్మీ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక భూటాన్ చివరిలో స్థానంలో ఉంది. అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుని మాత్రమే వీటిని ప్రకటిస్తారు. ఆర్థిక శక్తి, లాజిస్టికల్, ఎఫీషియెన్సీ వంటి అంశాలను పరిగణలోనికి తసీుకుని గ్లోబల్ ఫైర్ పవర్ రిపోర్టును విడుదల చేసింది.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ 10 దేశాల జాబితా:

1. యునైటెడ్ స్టేట్స్
2. రష్యా
3. చైనా
4. ఇండియా
5. సౌత్ కొరియా
6. యునైటెడ్ కింగ్‌డం
7. జపాన్
8. తుర్కియే
9. పాకిస్తాన్
10. ఇటలీ

ఇక మిలిటరీ శక్తి బలహీనంగా ఉన్న పది దేశాలు ఇలా ఉన్నాయి

1. భూటాన్
2. మాల్డోవా
3. సూరినామ్
4. సోమాలియా
5. బెనిన్
6. లైబీరియా
7. బెలీజ్
8. సియెర్రా లియోన్
9. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
10. ఐస్‌లాండ్

ఇది కూాడా చదవండి:  రాజీవ్‌గాంధీ హయాంలోనే రామమందిరానికి శంకుస్థాపన జరిగింది:శరద్ పవార్..!!

#indian-army #united-states #china #india #russia #global-firepower #global-military-strength-ranking #india-military #india-rank
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe