Andhra Pradesh: సోనియా, రాహుల్, ప్రియాంకను కలిసిన వైఎస్‌ షర్మిల

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను.. ఎపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా కలిశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపోతంపై తీసుకొనే నిర్ణయాలపై వారు చర్చించారు.

Andhra Pradesh: సోనియా, రాహుల్, ప్రియాంకను కలిసిన వైఎస్‌ షర్మిల
New Update

YS Sharmila: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీలను.. ఎపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కలిశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపోతంపై తీసుకొనే నిర్ణయాలపై వారు చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క అసెంబ్లీ, ఎంపీ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయిన సంగతి తెలిసిందే. కానీ గతంతో పోలిస్తే పెరిగిన ఓటింగ్ శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో షర్మిలకు ఏదైన కీలక పదవి ఇస్తారంటూ ప్రచారం నడుస్తోంది.

Also Read: అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి!

తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించిన షర్మిల.. అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని అనూహ్యంగా కాంగ్రెస్‌లో (Congress) కలిపేసింది. ఆ తర్వాత ఆమెకు కాంగ్రెస్ అదిష్ఠానం ఏపీసీసీ చీఫ్ (APCC Chief) బాధ్యతలు అప్పగించింది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పొందింది.  కడప (Kadapa) ఎంపీగా పోటీ చేసిన వైఎస్‌ షర్మిలకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆ స్థానంలో ఈసారి కూడా వైసీపీ నేత అవినాష్ రెడ్డినే గెలిచారు. షర్మిల వల్లే కాంగ్రెస్‌ పార్టీ తనకున్న ఓట్ బ్యాంకును కూడా కోల్పోయిందని.. పలువురు కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. అయితే తాజాగా షర్మిల.. పార్టీ అగ్రనేతలను కలిసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది.

Also Read: మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలిచ్చాం.. పల్లా శ్రీనివాసరావుతో చంద్రబాబు!

#ap-news #telugu-news #congress #ys-sharmila #rahul-gandhi #sonia-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe