Bigg Boss: బిగ్ బాస్ సీజన్ -7కు కొత్త చిక్కులు.. హీరో నాగార్జునకు నోటీసులు

తాజాగా ఈ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జునతో పాటు ఛానెల్ కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు తీర్పుతో బిగ్ బాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం..

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ -7కు కొత్త చిక్కులు.. హీరో నాగార్జునకు నోటీసులు
New Update

బిగ్ బాస్ సీజన్ -7కు కోర్టు నోటీసుల రూపంలో కొత్త చిక్కు వచ్చి పడంది. దీంతో ఈ షోపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ షో మొదట కొన్ని ఎపిసోడ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత నుంచీ షోపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షోలో కంటెంట్ కంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్, అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయని విమర్శలు మొదలయ్యాయి. కొంతమంది ప్రముఖులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ముఖ్యంగా సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఈ షోను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.

ఈ షో చూడటం వలన పిల్లలు, యువత చెడిపోతున్నారని కోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీంతో ఈ షోను నిలిపివేయాలంటూ హైకోర్టు కూడా తీర్పును ఇచ్చింది. తాజాగా ఈ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జునతో పాటు ఛానెల్ కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు తీర్పుతో బిగ్ బాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా బుల్లితెరపై 'బిగ్ బాస్' (Bigg Boss) షో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. రియాల్టీ షో పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది 'బిగ్ బాస్' షోనే. అంతలా ఈ కార్యక్రమంలో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే ఈ షో తెలుగులో ఆరు సీజన్ లను కంప్లీట్ చేసుకొని ఏడో సీజన్ కు రెడీగా ఉంది. ఇప్పటికే సీజన్-7కి సంబంధించి రెండు ప్రోమోలు వదలగా.. అవి జోరుగా వైరల్ అవుతున్నాయి. త్వరలో షో స్టార్ట్ చేయడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి కూడా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి కింగ్ నాగార్జున రెడీ అయిపోయారు. అయితే ఈ బిగ్ బాస్ షోపై గత కొంత కాలంగా వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దానికి తోడు కోర్టుల్లో కూడా కేసులు బుక్ అవుతున్నాయి.

అయితే బిగ్ బాస్ షోకు గతంలో కూడా ఇలాంటి నోటీసులు చాలానే వచ్చాయి. కానీ వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా షోను కంటిన్యూ చేశారు. మరి ఈ సారి ఏపీ హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేయడంతో అప్పుడు ఏమని తీర్పు చెబుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి ‘బిగ్ బాస్’ సీజన్ 7 జరుగుతుందా లేదా అనేది కోర్ట్ తీర్పుపై ఆధారపడి ఉంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

#ap-high-court #bigg-boss #hero-nagarjuna #bigg-boss-season-7 #high-court #latest-news #andhra-pradesh #entertainment-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి