Pawan Kalyan: 12 పారిశ్రామిక కారిడార్లలో ఏపీకి మూడు! ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. By Bhavana 29 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pawan Kalyan: ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లో.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక, ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం, ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం ప్రజలకు కూడా తెలుసు. గత ప్రభుత్వం హయాంలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడడంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ సవాళ్ల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కీలకమైన సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. కడప జిల్లా కొప్పర్తిలో రూ. 2,137 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ హబ్ రూ. 8,860 కోట్ల పెట్టుబడులు, 54,500 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూ. 2,786 కోట్లతో కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ అభివృద్ధి ద్వారా రూ. 12,000 కోట్ల పెట్టుబడులుగా రానున్నాయి. 45,000 మందికి ఉపాధి కల్పించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం రూ. 15.4 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేంద్రం ఏకంగా రూ. 4,500 కోట్లను మంజూరు చేయనున్నట్లు సమాచారం. పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ గ్రామీణాభివృద్ధికి తోడ్పాటు అందించినందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోందని పవన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన కోసం అంకిత భావంతో ఉంది అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. Also Read: అమెరికాలో ఇచ్ఛాపురం యువకుడి దుర్మరణం! #modi #ap #central-govt #tdp #nda #pawan-kalyan #janasena #chandrababu-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి