/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/YCP-Rebel-MLAs-jpg.webp)
No Ticket for YCP Rebel MLA's: మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో (AP Elections 2024) పాటు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ అభ్యర్థులను మొత్తం ఏడు విడతల్లో వైసీపీ (YCP) అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. వైసీపీ నుంచి ఇటీవల ప్రకటించిన లిస్టులలో అభ్యర్థుల మార్పులు చేర్పులతో 8వ లిస్ట్ కూడా త్వరలో విడుదల కానున్నట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ALSO READ: జనసేనను మింగేశాడు.. చంద్రబాబుపై సజ్జల హాట్ కామెంట్స్
మరోవైపు రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు టికెట్ రాలేదని.. పార్టీలో తమకు విలువ లేదంటూ కొందరు వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన (Janasena), టీడీపీలో (TDP) చేరిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ- జనసేన ఎన్నికల్లో పోటీ చేయబోయే ఉమ్మడి అభ్యర్థుల మొదటి లిస్టును విడుదల చేసింది. అయితే.. తమకు టికెట్ వస్తుందని భావించి టీడీపీ, జనసేన పార్టీలలో చేరిన వైసీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. టీడీపీ, జనసేన ప్రకటించిన మొదటి లిస్టులో వారికి టికెట్ రాలేదు. దీంతో వారు గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి ఐదుగురు ఎమ్మల్యేలు చేరారు. తాజాగా టీడీపీ-జనసేన ప్రకటించిన మొదటి లిస్టులో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్ దక్కింది. కొలుసు సారధికి నూజివీడు కేటాయించింది టీడీపీ. తాడికొండలో ఉండవల్లి శ్రీదేవికి బిగ్‌షాక్ ఇచ్చారు చంద్రబాబు (Chandrababu). తాడికొండ సీటును మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌కు కేటాయించారు.అలాగే ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఉదయగిరి సీటు టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్‌కి కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆత్మకూరు - ఆనం రాంనారాయణరెడ్డి పేరు తొలి జాబితాలో లేకపోవడంతో ఆయన చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే.. టికెట్ రాని ఈ నేతల తదుపరి కార్యాచరణపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.