Visakhapatnam: ఓవర్ టూ విశాఖ...పాలనకు ముహూర్తం ఫిక్స్ ఆంధ్రప్రదేశ్ లో పాలన విశాఖ నుంచి చేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22న విశాఖకు సీఎం జగన్ వెళతారని...అక్టోబర్ 23న సీఎం కార్యాలయంలో అడుగుపెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కార్యాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. By Manogna alamuru 30 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి CM Jagan likely to shift to Visakhapatnam by Dussehra: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) తన మకాం మార్చేందుకు సిద్ధమయ్యారు. దసరా నాటికి షిఫ్ట్ పాలన విశాఖకు మారనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. అన్నింటికీ మించి ముహూర్తాన్ని కూడా పండితులు ఖరారు చేసినట్టు సమాచారం. కోర్టు విచారణతో సంబంధం లేకుండా మకాం మార్చేందుకు జగన్ సిద్దమయ్యారు. ఇప్పుడు దానిని అమలులో తెచ్చేందుకు కార్యాచరణలో కూడా దిగిందని తెలుస్తోంది. ఇంతకు ముందే సీఎం జగన్ వైజాగ్ (Vizag)వెళ్ళడం, పాలనా కార్యాలయం ఎక్కడ ఉండాలో నిర్ణయించడం లాంటివి జరిగాయి. దాని తర్వాత వైజాగ్ లోని రుషికొండలో సీఎం ఆఫీస్ కట్టడం కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే నెల 15 కు కార్యాలయం మొత్తం నిర్మాణ పనులు పూర్తయిపోతాయని తెలుస్తోంది. దాన తరువాత అక్టోబర్ 22న సీఎం జగన్ వైజాగ్ వెళ్ళనున్నారు. తరువాతి రోజు అక్టోబర్ 23 న సీఎం కొత్త కార్యాలయంలో అడుగు పెట్టేందుకు ముహూర్తం ఖరారు అయిందని సమాచారం. అప్పటి నుంచి జగన్ వైజాగ్ నుంచి పాలనా కార్యక్రమాలు మొదలుపెడతారని చెబుతున్నాయి వైసీపీ (YSRCP) వర్గాలు. Also Read: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన దసరా తరువాత విశాఖకు షిఫ్ట్ అవుతానని రీసెంట్ గా ప్రకటించారు జగన్. రుషికొండలో (Rushikonda) ప్రభుత్వ కార్యాలయాల కోసం నాలుగు బ్లాక్‌లు ఉండేలా భవనాన్ని నిర్మించారు. ఇందులో ఒక బ్లాక్‌ను సీఎంవోకు ఉపయోగించేలా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఇంటీరియర్ పనులు మిగిలున్నాయి. ఇక ఏపీఎస్సీ బెటాలియన్ అవుట్ పోస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం పనులను కూడా అధికారులు పరిశీలించారు. అక్టోబర్ 24 నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలోనే ఉంటారని అధికారులు చెబుతున్నారు. దీంతో విశాఖపట్నం త్వరలో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యనగరంగా మారనుంది. ఏపీ భవిష్యత్ అంతా ఇక్కడి నుంచే ఉండవచ్చు. ఇప్పుటికే రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం..త్వరలో అతి కీలక నగరంగా మారనుంది. ఇది కూడా చదవండి:నిరుద్యోగులకు అలర్ట్…600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ…!! #andhra-pradesh #ycp #jagan #visakhapatnam #government #vizag #cm #cm-jagan-likely-to-shift-to-visakhapatnam-by-dussehra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి