ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 21 నుంచి అయిదు రోజుల పాటూ సమావేశాలు జరగనున్నాయి.

New Update
AP Assembly Meet: నేడు, రేపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలుంటాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ప్రకటించింది. మొత్తం 5 రోజుల పాటూ సమావేశాలు జరుగుతాయి. అవసరమయితే మరో రెండు రోజులు వాటిని పొడిగించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లు, సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న జీపీఎస్ సంబంధిత బిల్లులను పెట్టే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ఆర్డినెన్స్ బిల్లులు, కొత్త బిల్లులను కూడా ప్రవేశపెడతారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల మీద సీఎం జగన్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక గురువారం ప్రభుత్వ, పార్టీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

జీసీఎస్ బిల్లు మీద ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదన మీద కొన్ని రోజుల క్రితం జరిగిన మీటింగ్ లో ఉద్యోగులఉ మార్పులు కోరారు. వాటి మీద సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి మాట్లాడి వాటిని ఖరారు చేస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు