Angry : కోపం అనేది అందరికి రావడం సహజమే. కానీ కొంతమంది తరచుగా ఆగ్రహంతో ఇతరులపై అరుస్తుంటారు. ఇలాంటి వారికి గుండె సంబంధిత సమస్య(Heart Problems) ల ముప్పు ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. కొద్దిసేపు కోపంలో ఉన్నా కూడా రక్తనాళాల లైనింగ్‌లో ఒత్తిడి కలుగజేస్తుందని పరిశోధకులు గుర్తించారు. గత అధ్యయనాల్లో కోపం, గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఉందనే సంకేతాలు కూడా పంపాయి. ఇప్పుడు తాజా అధ్యయనంలో ప్రశాంతగా ఉండటం వల్ల రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది.
Also Read: ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటున్నారా? అయితే ఇది తప్పకుండా చదవండి..
రక్తనాళాల బలహీనత అనేది గుండెపోటు(Heart Attack), స్ట్రోక్ సమస్యను పెంచుతుందని కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ డైచీ షింబో(Prof. Daichi Shimbo) వెల్లడించారు. ప్రతికూల ఉద్వేగాలు హృద్రోగాలు, గుండెపోటుకు దారితీస్తాయని గత అధ్యయనంలో తేలింది. దీనికి ముఖ్యకారణం కోపమేనని గుర్తించారు. అంతేకాదు ఆందోళన, విచారం కూడా హృద్రోగ ముప్పును పెంచుతాయని గత అధ్యయనాల్లో బయటపడ్డాయి. ఇప్పుడు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో అవి నిజమని తేలాయి. అందుకే ప్రతి చిన్న చిన్న విషయాలకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.