Andole Ex MLA Babu Mohan: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్(Babu Mohan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బాబుమోహన్ ఇంతపెద్ద నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ అధిష్టానం వైఖరి, మీడియాలో వస్తున్న కథనాలే కారణంగా తెలుస్తోంది. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన బాబుమోహన్.. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారా? అంటూ నిప్పులు చెరిగారు.
పూర్తిగా చదవండి..Ex MLA Babu Mohan: బీజేపీపై ఆగ్రహం.. బాబు మోహన్ సంచలన నిర్ణయం..
బీజేపీ నాయకుడు బాబుమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు, బీజేపీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు. దీనంతటికీ కారణం.. తనకు టికెట్ కేటాయింపు విషయంలో బీజేపీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరే అని బాబుమోహన్ అంటున్నారు. టికెట్ తన కొడుక్కి ఇస్తారా? తనకు ఇస్తారా? క్లారిటీ ఇవ్వాలన్నారు. టికెట్ పేరుతో తనకు, తన కొడుక్కి మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. తన ఫోన్‌కు అగ్రనేతలెవరూ రెస్పాండ్ అవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Translate this News: