Andhra Pradesh: సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Lakshmi Narayana). శ్రీశైలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ.. సీఎం జగన్(CM YS Jagan) పాలనపై ప్రశంసలు కురిపించారు. విద్య, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి మంచి ఫలితం ఉంటుందన్న లక్ష్మీనారాయణ.. నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ప్రశంసించారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: సీఎం జగన్ పథకాలపై జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం.. ఫుల్ ఖుషీలో వైసీపీ ఫ్యాన్స్..
జగన్ పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని కొనియాడారు. అంగన్వాడీలలో చిన్నపిల్లలకు పౌష్టికాహారం, రాగిజావ ఇవ్వడంపై ప్రశంసలు కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు. బాధితుల దగ్గరకే డాక్టర్లు వెళ్లి పరీక్షలు చేయడం.. మందులు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ఎవరైతే విద్యా, వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో వారికి అంతే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందని అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
Translate this News: