Telangana Congress List: తెలంగాణలో ఎన్నికల వేళ కొందరు కాంగ్రెస్(Congress) నేతలకు జాక్‌పాట్ తగిలింది. ఏళ్లుగా పార్టీ టికెట్ కోసం ఎదురు చూస్తున్న నేతలను కాదని, కొత్తగా వచ్చిన నేతలకు టికెట్ వరించింది. ఇప్పుడిదే తెలంగాణ(Telangana) కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయంలో పార్టీ మారిన, ఇటీవల పార్టీలో చేరిన నేతలకు కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. ఈ విధంగా కొత్తగా పార్టీ చేరి టికెట్లు పొదిన నాయకులు 15 మంది వరకు ఉన్నారు. వీరిలో కొందరు ఇతర పార్టీల్లోంచి కాంగ్రెస్‌లో చేరిన వారు కాగా, మరికొందరు కొత్తగా కాంగ్రెస్‌లో ప్రస్థానం మొదలుపెట్టిన వారు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు..
కాంగ్రెస్ పార్టీ కొందరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పార్టీలో చేరడమే ఆలస్యం అన్నట్లుగా పలువురు నేతలకు టికెట్లు కన్ఫామ్ చేసింది. మరికొందరు పేర్లను హోల్డ్ లో ఉంచినా.. వారికి కూడా కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న నేతల్లో ప్రముఖంగా మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు సహా తదితర నేతలు ఉన్నారు.
Translate this News: