Ex MLA Babu Mohan: బీజేపీపై ఆగ్రహం.. బాబు మోహన్ సంచలన నిర్ణయం..

బీజేపీ నాయకుడు బాబుమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు, బీజేపీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు. దీనంతటికీ కారణం.. తనకు టికెట్ కేటాయింపు విషయంలో బీజేపీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరే అని బాబుమోహన్ అంటున్నారు. టికెట్ తన కొడుక్కి ఇస్తారా? తనకు ఇస్తారా? క్లారిటీ ఇవ్వాలన్నారు. టికెట్ పేరుతో తనకు, తన కొడుక్కి మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. తన ఫోన్‌కు అగ్రనేతలెవరూ రెస్పాండ్ అవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
Ex MLA Babu Mohan: బీజేపీపై ఆగ్రహం.. బాబు మోహన్ సంచలన నిర్ణయం..

Andole Ex MLA Babu Mohan: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్(Babu Mohan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బాబుమోహన్ ఇంతపెద్ద నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ అధిష్టానం వైఖరి, మీడియాలో వస్తున్న కథనాలే కారణంగా తెలుస్తోంది. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన బాబుమోహన్.. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారా? అంటూ నిప్పులు చెరిగారు.

ప్రధానంగా బీజేపీ ప్రకటించిన లిస్ట్‌లో తన పేరు లేకపోవడంపైనే ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి బాబుమోహన్‌కు టికెట్ రాదని, ఆయన తనయుడికి టికెట్ ఇస్తారని గత కొద్ది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కథనాలే ఆయనలో మరింత ఆగ్రహాన్ని రగిలించాయి.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆందోల్ నుంచి బీజేపీ త‌ర‌పున పోటీ చేసిన బాబుమోహ‌న్.. ఘోర పరాజయం పాలయ్యారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2018లో మాత్రం ఏకంగా మూడవ స్థానానికి పరిమితం అయ్యారు. ఆ తరువాత ఆయన పొలిటికల్‌గా కాస్త సైలెంట్ అయ్యారు. అయినప్పటికీ.. ఆందోల్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసేందుకు బాబుమోమన్ ఆసక్తి చూపారు. పార్టీ టికెట్ వస్తుందని ఆశించారు. అయితే, బీజేపీ అధినాయతక్వం మాత్రం బాబుమోహన్‌కు టికెట్ ఇచ్చేందుకు ఆసక్తిగా లేదని, ఆయన తనయుడికి టికెట్ ఇవ్వాలని భావిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.

Also Read: సీఎం జగన్‌ పథకాలపై జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం.. ఫుల్ ఖుషీలో వైసీపీ ఫ్యాన్స్‌..

ఈ ప్రచారంతో ఆగ్రహించిన బాబుమోహన్.. మీడియా ముందుకొచ్చారు. టికెట్ ఇవ్వరనే విషయాన్ని పార్టీ అధిష్టానమే చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. తన కొడుక్కి టికెట్ ఇస్తామని చెప్పడం ద్వారా తండ్రీకొడుకుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా? అని నిప్పులు చెరిగారు. తన క్రేజ్ ఏంటో బీజేపీ అధిష్టానం తెలుసుకోవాలని అన్నారు.

ఇదే అంశంపై క్లారిటీ తెచ్చుకునేందుకు.. బీజేపీ అగ్ర నేతలందరికీ ఫోన్ చేశానని, ఎవరూ రెస్పాండ్‌ అవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు బాబుమోహన్. ఏదో ఒకటి చెబితే సరిపోయేది కదా అని అన్నారు. అసలు పార్టీలో ఉండమంటారా? పొమ్మంటారా? చెప్పాలన్నారు. ఫోన్‌లో అందుబాటులోకి రావడం లేదనే.. ఇలా మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు బాబుమోహన్. టికెట్‌ను తనకు ఇస్తారా? తన కొడుక్కి ఇస్తారా? అనేది అధిష్టానం నేరుగా చెప్పాలని కోరారు. మీడియా ద్వారా తనకు తెలియడం మనసుకు బాధ కలిగించిందన్నారు.

ఈ కారణంగానే తాను కీలక నిర్ణయం తీసుకున్నానని, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. నవంబర్‌లో జరిగే ఎన్నికలకు, బీజేపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బాబుమోహన్ ప్రకటించారు. ఇక బీజేపీ అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ఆ పార్టీకి రాజీనామా చేయాలా? వద్దా? అనేది కూడా డిసైడ్ చేసుకుంటానని స్పష్టం చేశారు.

బీజేపీ నాటి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ కోరితేనే పార్టీలో చేరానని, ఐదేళ్లుగా పార్టీ కోసం ఎంతో పని చేశానని అన్నారు బాబుమోహన్. బీజేపీలో చేరిన తరువాత నియోజకవర్గానికి సంబంధించి అన్ని అంశాలను దగ్గరుండి చూసుకున్నానని తెలిపారు. నియోజకవర్గంలో జీరోలో ఉన్న బీజేపీని.. ఇప్పుడు నువ్వా నేనా అనే స్థాయికి తీసుకువచ్చానని చెప్పారు. బండి సంజయ్ పాదయాత్ర గానీ.. మంత్రుల ప్రోగ్రామ్స్ గానీ.. కార్నర్ మీటింగ్స్ గానీ.. అన్నీ తన ఆధ్వర్యంలోనే జరిగాయని వివరించారు. పార్టీ కోసం ఇంత చేస్తే.. టికెట్ కేటాయించకపోవడం, పైగా తనకు రెస్పాండ్ అవ్వకపోవడం అవమానంగా భావిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు బాబు మోహన్.

అభ్యర్థుల ప్రకటనలో దూకుడు..

నవంబర్ 30వ తేదీన తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను కన్ఫామ్ చేయగా.. కాంగ్రెస్ కూడా 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. ఇక బీజేపీ ఫస్ట్ లిస్ట్ పేరుతో 52 స్థానాలనకు, సెకండ్ లిస్ట్ పేరుతో 1 స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 66 స్థానాలకు అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేయాల్సి ఉంది.

Also Read: కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు..

Advertisment
తాజా కథనాలు