/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
Breaking News
Doraswamy Naidu:
మాజీ ఎమ్మెల్సీ దొరస్వామి నాయుడు కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం నర్రావూరు ఆయన స్వస్థలం. కాగా.. కాంగ్రెస్ తరపున కర్ణాటకలో ఎమ్మెల్సీగా పని చేశారు. దొరస్వామి నాయుడు మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తో పాటు ప్రముఖులు దొరస్వామి నాయుడి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
పి.ఈ.ఎస్.విద్యాసంస్థల అధినేత, పి.ఈ.ఎస్. యూనివర్సిటీ ఛాన్సలర్, మాజీ ఎమ్మెల్సీ, కర్ణాటక ప్రభుత్వ విద్యా విధానాల సలహాదారు, పెద్దలు శ్రీ ఎం.ఆర్.దొరస్వామి నాయుడు గారి మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.#MRDoreswamyNaidu#PESUniversity#PESEducationalInstitutionspic.twitter.com/C6a0uqn5oB
— Gali Bhanu Prakash (@GaliBhanuTDP) March 6, 2025
Follow Us