విశాఖపట్నంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో.. లారీ షాప్‌లోకి దూసుకెళ్లింది. గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వెంకట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో మరో యువతి రెప్పపాటులో తప్పించుకుంది. అలాగే అక్కడే ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటన సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఇప్పుడు ఆ ఫుటేజీ వైరల్‌గా మారింది. Also Read: అభిమానులకు 'KGF' హీరో బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే? సీసీ ఫుటేజీ ప్రకారం.. రోడ్డుకు ఎదురుగా ఒక కిరాణా షాపు ఉంది. ఆ షాప్‌కు ఓ యువతి వచ్చింది. ఆమెకు కావాల్సిన వస్తువులు అడిగింది. ఇంతలోపు రోడ్డుపై నుంచి ఒక ఇసుక లారీ స్పీడ్‌గా దూసుకువస్తున్నట్లు కనిపించింది. అయితే అది స్లో కాకపోవడంతో కిరాణా షాపు మీదికి దూసుకొచ్చింది. అదే సమయంలో ఆ యువతి ముందుగానే చూసి పక్కకు తప్పుకుంది. కానీ ఈ ప్రమాదంలో వెంకట రమణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో విషాదం Also Read: మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ మద్దిమడుగు గ్రామంలో వెంకటేశ్ - రమ్య దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె - ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఈ ఇద్దరి కుమారుల్లో చిన్న కుమారుడు సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ముర్రం కోటేశ్వరరావు సోదరితో కలిసి మట్టి తేవడానికి పోలానికి వెళ్లాడు. ఆ సమయంలోనే వీరిద్దరూ ముర్రం కోటేశ్వరరావు కంట పడ్డారు. దీంతో వెంటనే కోటేశ్వరరావు గొడ్డలితో ఆ బాలుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆ బాలుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ముర్రం కోటేశ్వర రావు తన సోదరిపై కూడా దాడికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఎంతో చాకచక్యంగా అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయింది. Also Read: 2024లో కనిపించని పెద్ద హీరోలు దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కోటేశ్వరరావుకు మతిస్థిమితం లేదని తెలిసింది. అందువల్లనే అతడి భార్య కొంత కాలం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.