YCP: సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్ల యుద్ధం జరుగుతోంది. నిన్న ఆస్తులపై జగన్‌కు షర్మిల రాసిన లేఖను టీడీపీ బయటపెట్టగ.. తాజాగా టీడీపీపై వైసీపీ మరో సంచలన ట్వీట్ చేసింది. డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? అంటూ సాక్షాలతో బయటపెట్టింది.

New Update
YS Jagan : గెలుపే లక్ష్యం.. ఆ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన జగన్!

YSRCP : ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్ల యుద్ధం జరుగుతోంది. నిన్న ఆస్తులపై జగన్ కు షర్మిల రాసిన లేఖను టీడీపీ బయటపెట్టగ.. తాజాగా టీడీపీపై వైసీపీ మరో సంచలన ట్వీట్ చేసింది. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?..  గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్‌ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్‌ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో! అని పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే నిన్న టీడీపీ బ్లాస్టింగ్ న్యూస్ అంటూ పోస్ట్ పెట్టింది. దానికి కౌంటర్ గా వైసీపీ కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బ్లాస్టింగ్ న్యూస్ ఇస్తామని పోస్ట్ చేసింది. ఇప్పటికే టీడీపీ పోస్ట్ చేయగా.. వైసీపీ ఎలాంటి సంచలనం తీసుకొస్తుందని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా దానికి తెర దింపిన వైసీపీ..  పోస్ట్ చేసింది.

Also Read :  మా వాడు క్వీన్ ఎలిజబెత్-2 రేంజ్‌! మేడమ్ టుస్సాడ్స్ లో ఆ ప్రత్యేక గౌరవం

Also Read :  పైనాపిల్ తింటే అంతే సంగతి!

ఆస్తి కోసం చెల్లిని...

కాగా ఆస్తి విషయంపై ఇటీవల షర్మిల జగన్ కు బాధతో లేఖ రాసిందంటూ టీడీపీ నిన్న సంచలన పోస్ట్ చేసింది. అందులో.. "మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వనరుల ద్వారా  సంపాధించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కు సమానంగా పంచాలని ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకు అంగీకరిస్తున్నాని ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటూ నిరాకరించారు. భారతీ సిమెంట్స్‌, సాక్షి ఇలా తన జీవితకాలంలో నాన్న సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ సమానంగా పంచుకోవాలని ఆనాడే నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా.. ''  అంటూ ఈ ఏడాది సెప్టెంబర్ 12న షర్మిల జగన్ కు రాసిన లేఖను టీడీపీ తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ లేఖపై వైఎస్ విజయమ్మ కూడా సంతకం చేసినట్లు కనిపిస్తోంది. 

Also Read :  షర్మిల సంచలన నిర్ణయం!

Also Read :  కరెంట్ ఛార్జీల పెంపుపై సంచలన ప్రకటన

Advertisment
Advertisment