దువ్వాడ నెక్స్ట్ స్టెప్.. | Duvavda Srinivas Suspension From YCP | Duvvada Next Step | YS Jagan |RTV
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారని చెప్పారు.
ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని దివ్వెల మాధురి చెబుతోంది. అతన్ని ఏ క్షణమైనా మట్టుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానిస్తోంది. ఇటీవలే గన్‌మెన్‌ను తొలగించడం, బిల్ కట్టినా తన ఇంటి కరెంట్ కట్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.
దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి జంట ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంటికి వెళ్లారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. త్వరలో ఈ జంట వివాహం చేసుకోబోతోందన్న చర్చ కూడా మొదలైంది. వేణుస్వామి వీరి పెళ్లి జరిపించనున్నారన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
దువ్వాడ శ్రీనివాస్‌ను డాక్టరేట్ వరించినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో US ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా ‘డాక్టరేట్’ బిరుదు పొందినట్లు సమచారం. దీనికి సంబంధించి ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి మరో షాక్ తగిలింది. ఇవాళ ఒక్కరోజే దువ్వాడపై రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు అయ్యాయి.పవన్‌పై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో కేసులు నమోదయ్యాయి.
దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి ప్రేమికుల రోజు సంబరాలు గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. అక్కడితో ఆగకుండా ముద్దులు, హగ్గులతో బాగా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.