Jagan: చంద్రబాబుకు జగన్ 6 ప్రశ్నలు.. చెప్పే దమ్ముందా అంటూ..!

AP: చంద్రబాబుకు జగన్ ఆరు ప్రశ్నలు వేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీలపై అడిగితే వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

YS Jagan Songs
New Update

Jagan: సీఎం చంద్రబాబును, కూటమి ప్రబుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీశారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తే తమ కార్యకర్తలపై తప్పుడు కేసు పెట్టి జైలులో వేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కక్ష రాజకీయాలకు తెర లేపుతున్నారని చెప్పారు. తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం మభ్య పెడుతుందని అన్నారు. తాను అడిగిన ఆరు ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ అడిగిన 6 ప్రశ్నలు...

"1. చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను పిల్లల చదువులకు  చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం నాకు ఆవేదన కలిగించింది. 

Also Read: 

2. చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియంను, 3వ తరగతి నుంచి టోఫెల్‌, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ నుంచి ఐబీదాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్‌, నాడు-నేడు ఇలా అన్నింటినీ  రద్దుచేసి 1-12వ తరగతి విద్యార్థులను, వారి తల్లులను దెబ్బతీశారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్‌, డాక్టర్‌ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారు. 

3. వైయస్సార్‌సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లం. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికం వరకూ రూ. 12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశాం. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైయస్సార్‌సీపీ హయాంలో మొత్తం ఈ రెండు పథకాలకే రూ.18వేల కోట్లు వరకూ ఖర్చు చేశాం. 

Also Read: ఝార్ఖండ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ?

4. ఎన్నికల కోడ్‌ కారణంగా జనవరి-మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్ లో వెరిఫికేషన్‌ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్‌లో అయినా ఇచ్చారా అంటే అదీలేదు. అప్పటినుంచి ఒక్కపైసాకూడా చెల్లించడంలేదు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితికూడా అంతే. తర్వాత ఏప్రిల్‌-జూన్‌, తర్వాత జులై-సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించి ఫీజులు చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడ్డంలేదు. ఇప్పుడు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం కూడా సగం గడిచిపోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్‌, బోర్డింగ్‌ ‌ఖర్చుల కింద వసతిదీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్‌ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరుచూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి, కాళ్లేమో గడపకూడా దాటడం లేదు. 

5.   ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.  చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీలేనివారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవి. 

6. ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్‌ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టే స్కాంలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధలేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా వసతి దీవెన డబ్బులు విడుదలచేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబుగారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. " అని ట్వీట్ చేశారు.

Also Read: షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు

Also Read: Big Boss 8: బిగ్ షాక్! నబీల్ ఎలిమినేటెడ్.. యష్మీ, పృథ్వీ డేంజర్ జోన్

#ycp #chandrababu #jagan #6 questions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe