Big Boss 8: బిగ్ షాక్! నబీల్ ఎలిమినేటెడ్.. యష్మీ, పృథ్వీ డేంజర్ జోన్

బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ వీక్ యష్మీ, నబీల్, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ నామినేషన్స్ లో ఉండగా.. ఊహించని విధంగా నబీల్ ఎలిమినేట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

New Update

Bigg Boss Telugu 8:   బిగ్ బాస్ సీజన్ 8 ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో పృథ్వీ, రోహిణీ మధ్య ఉత్కంఠగా సాగిన చివరి మెగా చీఫ్ టాస్క్ లో రోహిణీ విజేతగా నిలిచి.. బిగ్ బాస్ ఇంటి చివరి మెగా చీఫ్ అయ్యింది. పాపం పృథ్వీ మొదటి వారం నుంచి చీఫ్ అవడానికి  ఎంత కష్టపడినా.. లక్ మాత్రం కలిసిరాలేదు. బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ అవ్వాలనే తన కోరిక అలాగే మిగిలిపోయింది. 

Also Read: కుర్రాళ్ళ దిల్ దోచేస్తున్న బాలయ్య బ్యూటీ.. గోల్డెన్ డ్రెస్ లో హాట్ ఫోజులు

ఇది ఇలా ఉంటే ఈ వారం యష్మీ, నబీల్, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ నామినేషన్స్ లో ఉండగా.. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. నెట్టింట టాక్ ప్రకారం నబీల్, పృథ్వీ, యష్మీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో నబీల్ లేదా  యష్మీలో ఒకరు పక్కా ఎలిమినేట్ కానున్నట్లు అంటున్నారు. ఎక్కువగా నబీల్ పేరు  వినిపిస్తోంది. 

Also Read: ఎన్టీఆర్- హృతిక్ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ రచ్చ.. ఎవరో తెలుసా?

నబీల్ ఎలిమినేటెడ్ 

అయితే నబీల్ స్ట్రాంగ్ ప్లేయర్ అయినప్పటికీ.. ఈ వారం తన ఆట చూపించడానికి ఛాన్స్ దొరకలేదు. సో ఈ వారం నబీల్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువనే చెప్పాలి. అంతేకాదు పాస్ట్ 3 వీక్స్ నబీల్ నామినేషన్స్ లో లేకపోవడం కూడా అతని మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. వరుసగా నామినేషన్స్ లో లేకపోవడం వల్ల జనాలు అతన్ని మర్చిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటింగ్ తక్కువగా పడే అవకాశం ఉంది. 

Also Read: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్

యష్మీ డేంజర్ జోన్ 

ఇక యష్మీ, పృథ్వీ విషయానికి వస్తే..  వీరిద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నట్లు నెటిజన్లు అనుకుంటున్నారు. విష్ణు ప్రియా ఈ వారం నామినేషన్స్ లో లేకపోవడం పృథ్వీకీ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆమె ఫ్యాన్స్ ఇతనికి చేయొచ్చు. అంతేకాదు ఈ వారం టాస్కుల్లో కూడా పృథ్వీ భీభత్సమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక యష్మీ కూడా ఈ వారం బాగానే కనిపించింది. అయినప్పటికీ యష్మీ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లు టాక్. 

Also Read: కనుబొమ్మలు, వెంట్రుకలు తెల్లగా.. ప్రముఖ నటికి అరుదైన వ్యాధి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు