మాయ 'కి'లేడి వలపువల.. ఏపీ-తెలంగాణలో వారే టార్గెట్, దొరికినంత దోచేస్తూ!

మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన ఓ మహిళ బాపట్ల జిల్లాకు చెందిన 55ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. రెండోవివాహం కోసం చూస్తుండగా ఆమెతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆమె కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతడితో రూ.40వేలు షాపింగ్ చేయించిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారైంది.

matrimonial
New Update

ప్రస్తుత కాలంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు ఏవిధంగా ఎదుటివారి నుంచి డబ్బులు కాజేద్దామా అని చూస్తున్నారు. కొందరేమో ఆన్ లైన్ లో మోసాలు చేసి డబ్బులు కొట్టేస్తున్నారు. మరికొందరేమో ఎదుటివారి వీక్నెస్ ను పట్టుకుని కోట్లు దోచేస్తున్నారు. తాజాగా అలాంటిదే జరిగింది. 35-40 ఏళ్ల మద్య ఉన్న ఒక మహిళ పెళ్లై విడిపోయిన పురుషులనే టార్గెట్ గా పెట్టుకుంది. 

Also Read:  హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

వాళ్లతో పరిచయం పెంచుకుని మరింత దగ్గర అయింది. అదీ కావాలి.. ఇది కావాలి అంటూ వారితో షాపింగ్ చేయించి లక్షలు, కోట్లలో డబ్బులు కాజేసింది. ఏపీ, తెలంగాణల్లో ఈ కిలేడి బారిన పడిన ఎంతో మంది మోసపోయారు. ఇదంతా పోలీసులు చెప్తున్న మాట. ఒకరిద్దరు తమ బాధను పంచుకున్నారు కానీ ఫిర్యాదు చేయలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఎక్కువగా మ్యాట్రిమోనీ వెబ్ సైట్లో ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

Also Read:  USA: ట్రంప్‌ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు

ఏపీలో భాదితుడు

ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన 55 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. సమాజంలో కూడా మంచి గౌరవం ఉంది. అయితే అతడి భార్య అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతుంది. దీంతో అతడు చాలా మనోవేధనకు గురయ్యాడు. రెండో వివాహం చేసుకుంటానని భార్యకు చెప్పాడు. దానికి భార్య ఒకే చెప్పడంతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్లో అమ్మాయి కోసం సెర్చ్ చేశాడు. 

అందులో నగరానికి చెందిన ఒక మహిళ పరిచయం అయింది. ఇద్దరూ ఒకరి ఫోన్ నెంబర్ మరొకరికి ఇచ్చిపుచ్చుకున్నారు. కొద్ది రోజుల పాటు చాటింగ్ చేసుకున్నారు. ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుకున్నారు. అయితే ఇటీవలే తనను కలిసేందుకు హైదరాబాద్ రమ్మంది. దీంతో మనోడు బుల్లెట్ బైక్ పై రయ్ రయ్ మంటూ హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఆమె ఇచ్చిన అడ్రస్ ప్రకారం.. నగర శివారు షాపింగ్ మాల్ కు వెళ్లాడు. 

Also Read:  US: ట్రంప్‌ గెలుపు...అమెరికాకు గుడ్‌ బై చెబుతున్న హాలీవుడ్‌ హీరోయిన్లు

అనంతరం ఇద్దరూ కూర్చుని ఎంచెక్కా స్వీట్ గా మాట్లాడుకున్నారు. ఆమె అందం, మాటలు అతడికి ఎంతో నచ్చేశాయి. అదే అదునుగా భావించిన ఆమె అతడితో షాపింగ్ చేయించుకుంది. ఏకంగా రూ.40 వేల షాపింగ్ చేసింది. అక్కడితో ఆగకుండా బయటకు వచ్చి ఒక పెద్ద హోటల్ లో భోజనం చేశారు. 

ఒక అలా వారిద్దరూ మాట్లాడుకుంటుండగా.. ఓ పోలీసు కానిస్టేబుల్ వారి సమీపంలోకి వస్తుండటంతో.. భయపడినట్లు నటించిన ఆమె వెంటనే మళ్లీ కలుద్దాం అంటూ వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు తన సొంతూరికి చేరుకున్నాడు. అనంతరం ఆమె కాల్ చేసి తన అమ్మమ్మ చనిపోయిందని.. మూడు నెలల వరకు పెళ్లి జరగకూడదు అంటూ చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో మోసపోయానని అతడు గ్రహించాడు. 

Also Read:  Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్‌..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ!

విజయవాడకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి

ఇలానే విజయవాడకు చెందిన రిటైర్డ్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. ఆపై పెళ్లి బట్టలు, బంగారు ఆభరణాల కొనుగోలు కోసం ఏకంగా రూ.2.5 లక్షలు కొట్టేసింది. అలాగే సికింద్రాబాద్ లో కూడా రిటైర్డ్ ఆర్మీ అధికారికి మాట్రిమోనీలో ఒక మహిళ పరిచయమైంది. అతడి వద్ద దాదాపు రూ.5 లక్షలు కాజేసింది. దీనిపై పోలీసులు తగిన సూచనలు చేస్తున్నారు. మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమైన యువతి, యువకుడు దగ్గరై బహుమతులు కోరినా ఇచ్చేందుకు ప్రయత్నించినా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. 

#hyderabad #telangana-crime #dating-apps-scam #Crime Ap #new scam #Matrimony Scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe