Crime News: ఛీ ఛీ.. మీరు అన్నయ్యాలా.. కామాంధులా .. వద్దు వద్దన్నా చెల్లిని వదల్లేదు కదరా!

ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు చెల్లి అయిన యువతిపై ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఆమెకు మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. ఎలాగోలా ఆమె తప్పించుకుని ఫ్యామిలీకి చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.

New Update
west godavari two brothers harassed her sister

west godavari two brothers harassed her sister

కామాంధులు రోజు రోజుకు చెలరేగిపోతున్నారు. వావి వరస సంబంధం లేకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. నమ్మిన వారినే నట్టెట ముంచుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవలసిన సొంత వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి కామ కోరికలు ఉన్న ఇద్దరు యువకులు చెల్లిపై విరుచుకుపడ్డారు. వద్దు వద్దు అని వేడుకున్నా కనికరించలేదు. 

Also Read:Horoscope Today: నేడు ఈ రాశి వారికి బాగా కలిసివస్తుంది...ఏది పట్టుకున్న బంగారమే!

కానీ వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డ ఆ యువతి.. జరిగిన సంఘటనను వెళ్లి తమ తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: MK-84 Bombs: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

మాయ మాటలు చెప్పి

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా నూజివీడులోని ఓ ప్రభుత్వ కాలేజీలో యువతి ఇంటర్ చదువుతోంది. కాలేజీ సమయం అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతున్న క్రమంలో ఆమెకు అన్న వరుసైన ఇద్దరు యువకులు పాటిబండ్ల సంతోష్, ముల్లంగి ప్రదీప్‌లు కాలేజీ నుంచి వెనకపడ్డారు. ఇక మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటుందన్న సమయంలో ఆ యువతికి మాయమాటలు చెప్పి ఆమె బ్యాగ్‌ను వేరోక అమ్మాయికి అందించారు. 

Also Read:Harish Rao: ఏపీకి కృష్ణా జలాల తరలింపు.. ప్రభుత్వం ఏం చేస్తోంది.. సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్‌

అక్కడ నుంచి ఆమెను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని అజరయ్య పేటలోని సమాధుల వైపు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. వద్దు వద్దు అని ఆమె వేడుకున్నా వదల్లేదు. చివరికి ఎలాగోలా వారినుంచి తప్పించుకుని ఆ యువతి జరిగిన విషయాన్ని తన ఫ్యామిలీకి చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. ఆ ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు