BREAKING: ‘అఘోరి ఒంటికి పూసుకొనేది పాండ్స్ పౌడర్’!

సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు లేడీ అఘోరీపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒంటికి పూసుకునేది విభూది కాదని.. పాండ్స్ పౌడర్ అని అన్నారు. హిందూ ధర్మాన్ని గౌరవించాలనుకుంటే ఒంటిపై దుస్తులు ధరించాలన్నారు. అఘోరిలు జనస్రవంతిలో ఉండరని తెలిపారు.

Aghori
New Update

అఘోరీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మల్లింది. మూడు నాలుగు రోజుల నుంచి ఏపీలోని పలు ఆలయాలను సందర్శిస్తూన్న అఘోరి.. ఇక్కడ కూడా రచ్చ రచ్చ చేస్తుంది. రీసెంట్‌గా శ్రీకాళహస్తి ఆలయంలోకి ఆమెను వదలకపోవడంతో.. పెట్రోల్ పోసుకుని సంచలనం సృష్టించింది. అనంతరం లేడీ సెక్యూరిటీ ఆ అఘాయిత్యాన్ని ఆపి అఘోరికి వస్త్రాలు ధరించారు. ఆపై ఆలయంలోకి వదిలారు. 

Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!

ఇక ఇవాళ యాగంటి క్షత్రానికి వెళ్లే క్రమంలో తన కారు మొరాయించడంతో కాలినడకన బయల్దేరింది. రోడ్డు పక్కన పడుకుని నిరసన తెలిపింది. తను పోలీసుల బండి ఎక్కనని తెలిపింది. బలవంతం చేస్తే ఆత్మార్పణం చేసుకుంటానని బెదిరించింది. ఇలా రోజుకో ఆలయాన్ని సందర్శిస్తూ హాట్ టాపిక్ అవుతుంది. అయితే తాజాగా లేడీ అఘోరీపై సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిన వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు షాకింగ్ కామెంట్స్ చేశారు. 

Also Read: రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే!

అది విభూది కాదు.. పాండ్స్ పౌడర్

అఘోరి ఒంటికి పూసుకునేది విభూది కాదని.. అది ఒట్టి పాండ్స్ పౌడర్ అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆమె హిందూ ధర్మాన్ని గౌరవించాలి అని అనుకుంటే ఒంటి పై దుస్తులు ధరించాలి కానీ నగ్నంగా తిరగకూడదని అన్నారు. అఘోరీలు శివభక్తులు అని.. వారు జన స్రవంతిలో ఉండరని.. స్మశానంలో ఉంటారని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో అఘోరీ పెట్రోలు పోసుకొని ఆత్మార్పణం చేసుకొంటాననడం హిందువులకు అవమానం కలిగించే విషయమని తెలిపారు. ఆమె అఘోరిలో వ్యవహరించడం లేదని.. రౌడీలా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పట్టుకుని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ప్రస్తుతం వారి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

కాగా తెలంగాణ సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించిన అనంతరం అఘోరిని రెండు రోజులు పోలీసులు నిర్భందించారు. అనంతరం ఆమెను మహారాష్ట్ర సరిహద్దులో విడిచిపెట్టేశారు. ఇక అక్కడ నుంచి ఏపీలో అడుగుపెట్టిన అఘోరి వచ్చి రాగానే వైజాగ్ సమీపంలోని టోల్ గేట్ వద్ద రచ్చ చేసింది. 

ఇక ఇటీవలే శ్రీకాళహస్తిలో అడుగుపెట్టింది. నగ్నంగా రావడంతో ఆమెను ఆలయంలోకి అనుమతించలేదు. దీంతో తనపై పెట్రోల్ పోసుకుని బెదిరించింది. అనంతరం ఆమెకు వస్త్రాలు ధరించి లోపలకి పంపించారు. ఇక అక్కడి నుంచి వెంటనే కారులో పంపించేశారు. అదే సమయంలో కొంత దూరం ప్రయాణించగానే అఘోరి కారుకు యాక్సిడెంట్ అయింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆమెను తమ వాహనంలో తీసుకెళ్లారు. ఇక ఇవాళ కర్నూల్‌లోని యాగంటి క్షత్రం ఆలయానికి కాలినడకన చేరకుంది.

#aghori #vizag-satya #lady-aghori #UPPAL BALU
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe