జనసేన(janasena) మాజీ నేత వినూత డ్రైవర్ రాయుడు(kota vinutha driver rayudu) కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాయుడు షాకింగ్ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు రాయుడు. ఎన్నికలకు ముందు నుంచే టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డితో...టచ్‌లో ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పాడు రాయుడు. పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్, సుజిత్ రెడ్డి అనే ముగ్గురు తనను సుధీర్ రెడ్డికి పరిచయం చేశారని తెలిపాడు. వినూతకు సంబంధించిన విషయాలు చెప్పినందుకు 024 ఎన్నికల ఫలితాలకు ముందు సుధీర్ రెడ్డి రూ.2 లక్షలు ఇచ్చారని వెల్లడించాడు. వినూత, చంద్రబాబును చంపాలని సుధీర్ రెడ్డి చెప్పాడని, 2 సార్లు కారు యాక్సిడెంట్‌కు ప్రయత్నించా, కుదర్లేదని వీడియోలో చెప్పాడు.
Also Read : రైతులకు గుడ్‌న్యూస్.. దీపావళికి ముందే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
కోట వినూత డ్రైవర్ సంచలన వీడియో
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) October 12, 2025
హత్యకు ముందు రికార్డ్ అయిన కోట వినూత డ్రైవర్ వీడియో
వీడియోలో సంచలన నిజాలు చెప్పిన డ్రైవర్ రాయుడు
సిహెచ్.శ్రీనివాసరావు (రాయుడు)
2019 నుంచి వినీత వద్ద నమ్మకంగా పనిచేస్తున్నా
నవంబర్ నెలలో టిడిపి పార్టీ ఆఫీస్ లో టిడిపి , జనసేన సమన్వయ సమావేశం… pic.twitter.com/2hq6hIDY70
Also Read : నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఏపీ సర్కార్ యాప్
ప్రైవేట్ వీడియోలు తీసుకురావాలని
వినూత, చంద్రబాబు(chandrababu) ప్రైవేట్ వీడియోలు తీసుకురావాలని... బొజ్జల సుధీర్ రెడ్డి నేరుగా నన్ను కలిసి బెదిరించాడని రాయుడు తెలిపాడు. ప్రైవేట్ వీడియోలు తీసుకువస్తే రూ. 30 లక్షలు ఇస్తానని ఆఫర్ చేశాడని, బెడ్రూంలో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తుండగా దొరికిపోయానని రాయుడు తెలిపాడు. ఈ వరుస పరిణామాలల నేపథ్యంలో జులై 7న డ్రైవర్ రాయుడును కోట వినూత,చంద్రబాబు హత్య చేశారు. తాజాగా హత్యకు ముందు వెలుగులోకి వచ్చిన కోట వినూత డ్రైవర్ రాయుడు తీసుకున్న సంచలన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది.
వినూత గత నెలలో డ్రైవర్ రాయుడుని సస్పెండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ రాయుడు కొంతకాలంగా వినూత కోట దగ్గర నమ్మిన బంటుగా, డ్రైవర్‌గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు. అయితే జూన్ 21న అతను చేసిన అనుచితమైన, అభ్యంతరకరమైన, కుట్రపూరితమైన, మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి, మాకు ఎన్నో రకాలుగా ప్రాణ, గౌరవ అంశాలలో భంగం కలిగించాడు. రాయుడిని పనిలో నుంచి తొలగిస్తున్నట్లు వినూత కోట పోస్ట్ చేసింది. ఇక మీదట డ్రైవర్ రాయుడికి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో ఆమె పేర్కొంది.