/rtv/media/media_files/2025/04/11/TPImLuFwJ0WlC2eAUGOw.jpg)
AP CM Chandrababu Warning
నకిలీ మద్యాన్ని అరికట్టడానికి ఏపీలోని చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మద్యాన్ని గుర్తుపట్టడానికి ఓ యాప్ తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కొత్త యాప్ ద్వారా మద్యం బాటిల్‌పై ఉండే హోలోగ్రామ్ స్కాన్ చేస్తే అది నకిలీదా? లేదా అసలైనదేనా? తెలిసేలా ఈ యాప్ ఉంటుందన్నారు. ఈరోజు ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ వివరాలను వెల్లడించారు. ఏపీలో నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్న జనార్ధన్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయనను మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు. ఈనెల 17 వరకు ఆయనకు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలిస్తున్నారు.