Chandrababu Naidu : నేడు సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు!
సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఆయన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారు.
సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఆయన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారు.
విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులు నీళ్లు కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అజిత్ సింగ్ నగర్ లో ఉన్న బంకులో పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులకు ఈ చిత్రమైన అనుభవం ఎదురైంది. పెట్రోల్ ట్యాంక్ లో వాన నీరు కలవడం వల్ల ఇలా జరిగిందని బంకు యాజమాన్యం తెలిపింది.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో బీహార్ చెందిన కార్మికులు ఆరుగురు, స్థానికులు 9మంది ఉన్నట్లు సమాచారం.
ఏపీలో సోమవారం నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ వసూలుచేసి ప్రజలకు ఇసుకను అందజేయనున్నారు. ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుక వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లనున్నారు.
వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలన్నారు ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు.
AP: కొడాలి నానిపై కేసు నమోదైంది. నానితో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రస్తుత తూర్పు గోదావరి కలెక్టర్ మాధవీలతారెడ్డిపై గుడివాడ పొలిసులు కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వీరు కారణమైయ్యారని ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.
పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. పూర్వపు ఇన్వెస్టిమెంట్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఏపీలో 2022 గ్రూప్-1 ర్యాంకులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాలో వెలువడిన కథనాల ఆధారంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ కు సపోర్టుగా పనిచేసిన అధికారులు, నాయకులతోపాటు జగన్ బంధువులంతా టాపర్లుగా నిలవడం చర్చనీయాంశమైంది.