AP News: ‘తల్లికి వందనం’పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన.. రూ.15వేలు రావాలంటే!

‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఏపీ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. రూ.15వేల కోసం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాతే దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

New Update
AP News: ‘తల్లికి వందనం’పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన.. రూ.15వేలు రావాలంటే!

Amaravathi: ‘తల్లికి వందనం’ పథకంపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఆ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. ఈ పథకం కింద రూ.15వేలు రావాలంటే ఇలా చేయాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. ఈ పథకం విధివిధానాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన తర్వాతే దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు