AP News: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి సీఎం చంద్రబాబు! ఏపీ నుంచి లద్దాక్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కాబోతున్న చీఫ్ జస్టిస్ శ్రీధర్ సింగ్ ఠాకూర్ ను సీఎం చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. స్వయంగా ఠాకూర్ నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించారు. గతేడాది జులై 24న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు ఠాకూర్. By srinivas 12 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Vijayawada: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే ఠాకూర్ ను లద్దాక్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కాగా ఠాకూరు బదిలీపై వెళ్లనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఠాకూర్ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇక గతేడాది జులై 24న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఠాకూర్.. ప్రస్తుతం ధీరజ్ సింగ్ బదిలీ కావడంతో కొత్త చీఫ్ జస్టిస్ ఎవరు నియామకంపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి పలువురు అధికారులు బదిలీ అవుతున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న కారణంతో పలు శాఖల్లో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని అధికారులను బదిలీ చేస్తోంది. #chief-justice-shri-dheeraj-singh-thakur #cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి