ఆంధ్రప్రదేశ్ Budameru: యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు AP: బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. చెన్నై, సికింద్రాబాద్ రెజిమెంటల్ ఆర్మీ జవాన్లు ఈ పూడ్చివేతలో పాల్గొంటున్నారు. పూడ్చివేత పనులు దాదాపు అయిపోయినట్లు తెలుస్తోంది. బుడమేరు వాగుకు గండ్లు పడడంతో విజయవాడ నీటమునిగిన విషయం తెలిసిందే. By V.J Reddy 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Akhila priya: అఖిలప్రియ రెడ్ బుక్లో ఆ 100 మంది పేర్లు: తోలుతీస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్! తన దగ్గర రెడ్ బుక్ ఉందని, అందులో 100 మంది పేర్లు ఉన్నాయంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అధికారంలోకి వస్తే కొంతమంది తోలు తీస్తానని ముందే చెప్పాను. ఇప్పుడు ఎవరినీ వదిలిపెట్టను. లీగల్గా కేసులు పెట్టిస్తా' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeswari: ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయకండి.. వైసీపీకి పురంధేశ్వరి వార్నింగ్..! విజయవాడ బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలించారు. ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడిందని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: సీఎం చంద్రబాబు బుడమేరు ఏరియల్ విజిట్.. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిపై.. సీఎం చంద్రబాబు బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు. బుడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది? బుడమేరు ఎక్కడ ఆక్రమణలకు గురైంది? తదితర అంశాలను చంద్రబాబు పరిశీలించారు. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Floods: వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ AP: ఈరోజు నుంచి వరద బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనుంది చంద్రబాబు సర్కార్. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు నూనెతో వ్ వంటి నిత్యావసర వస్తువులకు 2లక్షల కుటుంబాలకు అందించనుంది. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేయనుంది. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: బుడమేరు గండ్లు పూడ్చివేతకు రంగంలోకి ఆర్మీ! బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చేందుకు గత నాలుగు రోజుల నుంచి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ ఇంజనీర్ల బృందం కూడా రంగంలోకి వచ్చింది. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో నిమగమైంది. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kaikaluru-Eluru-Kolleru : నీట మునిగిన ఏలూరు-కైకలూరు రహదారి! విజయవాడ బుడమేరు వరద నీరు అంతా కొల్లేరులోకి చేరుతుండడంతో కొల్లేరు ఉద్ధృతంగా ప్రవాహిస్తుంది. దీంతో కైకలూరు-ఏలూరు రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లేరును దాటే ప్రయత్నం ఎవరూ చేయోద్దని పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీకి మరోసారి వానగండం.. భారీ వర్షాలు కురిసే అవకాశాలు! ఏపీకి మరోసారి వానగండం పొంచి ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేశారు. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : విజయవాడలో ఇన్సూరెన్స్ కోసం వరద బాధితుల క్యూ తెలుగు రాష్ట్రాల్లో వరద తీరని కష్టాలను మిగిల్చింది. ఇళ్ళు మునిగిపోయాయి. ఫర్నిచర్ నాశనం అయిపోయింది. వాహనాల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు వరద తగ్గుముఖంపట్టడంతో నానిపోయిన బళ్ళతో జనాలు ఇన్సూరెన్స్ కోసం క్యూ కడుతున్నారు. By Manogna alamuru 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn