/rtv/media/media_files/2025/05/20/uucENVBUUayMPFnsFTU9.jpg)
NTR District: lady teacher acid attack on principle
AP News: విధుల నుంచి తొలగించారని పాఠశాల ప్రిన్సిపల్ పై యాసిడ్ దాడికి తెగబడింది ఓ లేడీ టీచర్. ఈ దారుణ ఘటన ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలోని డాన్ బోస్కో స్కూల్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రియదర్శిని అనే మహిళా గుంటుపల్లిలోని డాన్ బోస్కో స్కూల్ లో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. అయితే ఈమె విద్యార్థులను కొడుతున్నట్లు తరచూ ప్రిన్సిపల్ విజయ్ ప్రకాష్ కి ఫిర్యాదులు వెళ్లాయి.
Also Read : బార్డర్లో వరంగల్ జవాన్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని.. కారణం అదేనా?
Also Read : బెంగళూరులో వర్షాలే వర్షాలు.. రన్నింగ్ బస్సుల్లోకి నీళ్లు.. వీడియోలు వైరల్!
ప్రిన్సిపల్ పై యాసిడ్ దాడి
దీంతో ప్రిన్సిపల్ విజయ్ ప్రకాష్ ఆమెను విధుల నుంచి తొలగించారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ తో మాట్లాడేందుకు సోమవారం స్కూల్ కు వచ్చిన ప్రియదర్శిని దారుణానికి పాల్పడింది. ప్రిన్సిపల్ మాట్లాడుతుండగా అతడిపై యాసిడ్ తో దాడి చేసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్ ను చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి కు తరలించారు.
Also Read : కేసీఆర్ కు జైలు తప్పదా? కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్!
Also Read : కరువు అంచున పాక్..ఉగ్రవాదం కారణంగా తగ్గిన సాయం
latest-news | telugu-news | ntr-district acid-attack | Acid Attack News