AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..టూరిజం పాలసీకి ఆమోదం ఏపీ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. By Manogna alamuru 20 Nov 2024 in విజయవాడ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AP Cabinet Meeting - Chandrababu ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌లో టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించాలని నిర్ణయించారు. అలాగే జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్‌ఫ్రా ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకి కుదిస్తూ చట్ట సవరణ చేశారు. Also Read : పోలింగ్ బూత్ దగ్గర విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్యే అభ్యర్థి మృతి Also Read : వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు సర్కార్ కొత్త స్కెచ్.. మరి కోర్టులు ఒప్పుకుంటాయా? ఇక 2024–25 కొత్త క్రీడా పాలసీని కూడా తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటూ డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్‌గా అంటే ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్‌గా మార్చాలన్న తీర్మానానికి మంత్ర వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు క్యాబినెట్ ఆమోదం లభించింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పులు బదలాయిస్తూ ప్రతిపాదన చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు..పీడీ యాక్ట్‌ను బలోపేతం చేస్తూ చట్ట సవరణకు ఆమోదం లభించింది. అలాగే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపులు పునరుద్ధరణ..లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు..అమరావతి సాంకేతిక కమిటీకి..ఏపీలో రూ. 85వేల కోట్ల పెట్టుబడులకు..SIPB నిర్ణయాలకు కేబినెట్ ఆమోదించింది. Also Read: Maharashtra: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే! Also Read: పదేళ్లు ఏం వెలగబెట్టారని మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు.. బీఆర్‌ఎస్‌కు రేవంత్ చురకలు #pawan-kalyan #chandrababu #ap-cabinet-meeting #ap-secretariat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి