AP Cabinet Meeting:
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. ప్రభుత్వం ఏర్పడగానే జరిగిన సమావేశాల్లో మూడు నెలలకు మాత్రమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించారు. అప్పటికి ఇంకా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడకపోవడం..పాలనపై స్పష్టత లేకపోవడం వలన మధ్యంతన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాం చెప్పారు. అయితే ఇప్పుడు 2024–25 సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అధ్యక్షతన నవంబర్ 11న రాష్ట్ర మంత్రి మండలి ప్రత్యేక సమావేశం కానుంది. 11న ఉదయం 9 గంటలకు సీఎం ఛాంబర్లో కేబినెట్ భేట అవనుంది. దీంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించనుంది. కేబినెట్ ఆమోదించిన తర్వాత శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు, అంశాలను రాష్ట్ర గవర్నర్‌కు మంత్రి పయ్యావుల వివరించారు. మంత్రి పయ్యావులకు ఇదే మొదటి బడ్జెట్.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అధ్యయనానికే నాలుగు నెలలకు పైగా సమయం పట్టిందని మంత్రి పయ్యావుల చెప్పారు. దాంతోపాటూ అప్పులు, ఆదాయాల వివరాలు పూర్తి స్థాయిలో నివేదిక కోసం ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై గతంలో శ్వేతపత్రం కూడా వెలువరించింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..
ఈ 2024–25 పూర్తి బడ్జెట్‌ను అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. పూర్తి స్థాయి బడ్జెట్‌కు తుదిమెరుగులు అద్దుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో రాజధాని పనులు, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. అలాగే జగన్ ప్రభుత్వం సమయంలో జరిగిన ఆర్థిక అవకతవకలను కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో కూటమి బహిర్గతం చేయనుందని తెలుస్తోంది.
Also Read: USA: ట్రంప్‌కు కాపలాకాస్తున్న రోబోటిక్ డాగ్స్..