AP News: వ్యభిచారం వీడియోలు ఎందుకు బయటపెట్టారు.. పోలీసులపై వైసీపీ నేత ఆగ్రహం!

విజయవాడ వ్యభిచారం కేసులో తన వీడియోలు విడుదల చేసిన పోలీసులపై వైసీపీ నేత శంకర్ నాయక్  ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 'పోలీసులు తీరు వల్ల నా కుటుంబం రోడ్డున పడింది. నా భార్య సూసైడ్ చేసుకుంటానంటోంది. మీ అంతు చూస్తా' అని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. 

New Update
vjayawada spa

Vijayawada prostitution case

AP News: విజయవాడ వ్యభిచార గృహంలో అడ్డంగా బుక్కైన వైసీపీ నేత శంకర్ నాయక్ తన వీడియోలు సోషల్ మీడియాలో పోలీసులు పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరు వల్ల తన కుటుంబం రోడ్డున పడిందని, ఒకరోజులోనే తన పేరు నాశనం చేశారంటూ అసహనం చెందారు. అంతేకాదు పోలీసులను మీ అంతు తేలుస్తా అంటూ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. 

భార్య సూసైడ్..

స్పా సెంటర్‌లో దొరికిన నా వీడియోలను ఎందుకు రిలీజ్ చేశారు. మంచం కింద దాక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని వల్ల మా కుటుంబం రోడ్డున పడింది. నా భార్య సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తోంది. నా పేరు, ప్రతిష్టలు దెబ్బతినేలా చేశారు. ఇదంతా కావాలనే చేశారని నాకు తెలుసు. మీ అంతు చూస్తాం అంటూ ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు వడిత్యా సోమశంకర్‌ నాయక్‌ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజు భార్యకు ఈ బహుమతి ఇస్తే.. మీరు ఊహించనివి జరుగుతాయ్!

విజయవాడ స్పా సెంటర్ పై పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 10 మహిళలు, 13 మంది విటులను అరెస్ట్ చేశారు. అందులో శంకర్‌ నాయక్‌ ఒకడు. కాగా.. విటుల నుంచి పోలీసులు ఫోన్లు స్వాధీనం చేసుకొని, స్టేషన్‌ బెయిలిచ్చి విడుదల చేశారు. ఇక  శంకర్‌నాయక్‌ను వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం అధికాకరిక ప్రకటన విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: Punjab: పంజాబ్‌లో త్వరలో ఆప్ ప్రభుత్వం కూలిపోతుంది: కాంగ్రెస్ నేత

 

Advertisment
Advertisment
తాజా కథనాలు