/rtv/media/media_files/2025/02/24/Qnh8S1nbSjxKC6UAXBoy.jpg)
Trouble For AAP Government In Punjab, Says Congress Leader Pratap Singh Bajwa
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని కాంగ్రెస్ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా అన్నారు. మా పార్టీతో 32 మంది కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలిపారు. మరికొందరు బీజేపీతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం పడిపోతే దీనికి బీజేపీదే బాధ్యత అని.. కాంగ్రెస్‌ది కాదని పేర్కొన్నారు. అంతేకాదు కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాక మంత్రులు, ఇతర బడా నేతలు కూడా తమతో టచ్‌లోకి వచ్చినట్లు తెలిపారు.
Also Read: భారత్‌లో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్‌తో మృతి.. సర్వేలో సంచలన విషయాలు
కానీ ఆప్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అస్థిరపరచదని కూడా చెప్పారు. ఆప్ ఐదేళ్ల పాటు మనుగడలో ఉంటుందన్నారు. ఒకవేళ పడిపోతే మాత్రం బీజేపీదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు. '' రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు హవాలా మార్గంలో ఇతర రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియాలకు వెళ్లాయి. ఈ డబ్బంతా కూడా మద్యం, భూమి వినియోగంలో మార్పులు చేయడం వల్ల వచ్చిందే. దీనికి ఆప్ నేతలే బాధ్యత వహించాలి. పంజాబ్‌లో ఢిల్లీ మోడల్ అమలు చేస్తున్నామని సీఎం భగవంత్ మాన్ అంటున్నారు. కానీ ఆప్ నేతలు మాత్రం భారీగా ప్రజల సొమ్మును దోచుకుంటూ ఢిల్లీ మోడల్‌ను నిజం చేశారని'' ప్రతాప్ సింగ్ బజ్వా అన్నారు.
Also Read: ఏం పుట్టుకరా మీది.. మహాకుంభమేళాలో మహిళల వీడియోలకు రేటు.. ఒక్కో వీడియోకు..
ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందించింది. ఆయన బీజేపీ నుంచి ఇప్పటికే టికెట్ హామీ పొందారని ఆరోపించింది. కర్ణాటకలోని బెంగళూరులో ఓ సీనియర్ బీజేపీ నేతను బాజ్వా కలిసినట్లు ఆప్ నేతలు నీల్ గర్గ్ తెలిపారు. అంతేకాదు రాహుల్ గాంధీ కూడా ప్రతాప్ బజ్వాపై ఒక కన్నేసి ఉంచాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భగవంత్ మాన్ ప్రభుత్వం కూడా విపక్షాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది. 2027 ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు మరి ఆప్ ప్రభుత్వమే ఉంటుందా ? లేదా ? అనేది ఆసక్తికరంగా మారింది.