Accident: కుక్కల భయంతో రైలు కిందపడి చనిపోయిన 80 గొర్రెలు!

ఏపీ విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుక్కల భయంతో రైల్వే ట్రాక్ పైకి పరిగెత్తిన 80 గొర్రెలను భీమసింగి వద్ద ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. అన్నీ అక్కడికక్కడే మరణించాయి. దీంతో తమను ఆదుకోవాలంటూ రైతులు అధికారులను వేడుకుంటున్నారు. 

దిఆ
New Update

Vijayawada: ఏపీ విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుక్కల భయంతో 80 గొర్రెలు రైలు ఢీకొని చనిపోయాయిన ఘటన కలిచివేసింది. స్థానికులు, భాదితుల వివరాల ప్రకారం.. లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొలగాని ఎర్నాయుడు, గొలగాని సింహాచలం, గొంప బంగారునాయుడు, ఆనందపురానికి చెందిన వారాది రమణమ్మ తమ గొర్రెల మందలను జామి మండలంలోని భీమసింగి పంచాయతీ యాతపాలెం రైల్వే ట్రాకు దగ్గరలో మేత కోసం తోలుకెళ్లారు. 

ఇది కూడా చదవండి: అలా చేయొద్దు నాన్న.. అన్నందుకే కూతురిని కడ తేర్చిన తండ్రి!

ప్రాణ భయంతో రైల్వే ట్రాకుపైకి పరుగులు..

ఈ క్రమంలోనే గొర్రెలపై స్థానికంగా ఉండే కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. ప్రాణ భయంతో రైల్వే ట్రాకుపైకి పరుగులు తీశాయి. అప్పటికే విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ వాటిని ఢీ కొట్టింది. దీంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక గొర్రెల మరణంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతోపాటు పశువైద్యాధికారి గీతావాణి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: సైకిల్ తోసుకుంటూ వెళ్తున్న ఉస్తాద్ హీరో.. 'RAPO 22' ప్రీ లుక్ వైరల్

Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

#vijayawada #accident #train #80 sheeps #prasanthi express
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe