అలా చేయొద్దు నాన్న.. అన్నందుకే కూతురిని కడ తేర్చిన తండ్రి! ఏపీ కర్నూలు జిల్లా తంగరడోణ గ్రామంలో ఘోరం జరిగింది. మద్యానికి బానిసైన వీరేష్.. ఇంట్లో డబ్బులు దొంగిలిచొద్దని హెచ్చరించిన 10 ఏళ్ల కూతురు గొంతుకు తాడు బిగించి చంపేశాడు. బాధితురాలి నాన్నమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 20 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP crime: ఏపీలో ఘోరం జరిగింది. అలా చేయొద్దు నాన్న అన్నందుకు కన్న కూతురిని కడ తేర్చాడు ఓ కసాయి తండ్రి. ఆమె గొంతుకు తాడు బిగించి ఊపిరి ఆగేవరకూ వదలకుండా క్రూర మృగంలా ప్రవర్తించాడు. హృదయాలను కలిచివేస్తున్న ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని తంగరడోణ గ్రామంలో చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంట్లోనే తాడుతో గొంతు బిగించి.. Also Read: Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు!ఈ మేరకు తంగరడోణ గ్రామానికి చెందిన వీరేష్, పద్మ దంపతులకు కొంతకాలం క్రితం పెద్దలు కుదిర్చిన వివాహమైంది. అయితే కూతురు పుట్టిన కొన్నేళ్లకు మద్యానికి బానిసయ్యాడు వీరేష్. దీంతో వీరేష్ వేధింపులు భరించలేక భార్య పద్మ పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తండ్రి, నాన్నమ్మతో కలిసి ఉంటోంది మౌనిక (10). అయితే మంగళవారం మద్యం కోసం ఇంట్లో దాచిన డబ్బులు తీస్తుండగా వీరేష్ ను మౌనిక అడ్డుకుంది. డబ్బు తీసుకుంటే నాన్నమ్మ కు చెబుతానని బెదిరించిది. దీంతో తన దొంగతనం గురించి తన తల్లికి చెబుతుందోమేనని ఆందోళన చెందిన వీరేష్.. ఇంట్లోనే తాడుతో గొంతు బిగించి కూతురును హత్య చేశాడు వీరేశ్. విషయం గమనించిన స్థానికులు మౌనిక నానమ్మకు సమాచారం ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్పట్టినట్లు ఆస్పరి పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: నిండా ముంచిన సువర్ణ భూమి.. లాభాల ఆశ చూపి రూ.200 కోట్లు స్వాహా! ఇదిలా ఉంటే.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురంలో దారుణం చోటుచేసుకుంది. యువరాజు అనే యువకుడుపై నలుగురు యువకుల పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, బీర్ సీసాలు, బెల్ట్‌తో దాడి చేస్తూ బట్టలు విప్పి యువరాజును దారుణంగా గాయపరిచారు. దాడికి గురైన యువకుడుAFDT జూనియర్ కాలేజీ విద్యార్ధిగా పోలీసులు గుర్తించారు. దాడి చేసిన దృశ్యాలను కొందరు మొబైల్లో రికార్డ్ చేయగా యువరాజు తండ్రి శంకర్ రావు ఫిర్యాదుతో మల్కిపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాజు అనే యువకుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అమ్మాయి విషయంలోనే గొడవ జరిగినట్లు పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. సోషల్ మీడియాలో ఫైటింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది కూడా చదవండి: Soudi: రాజద్రోహం, అత్యాచారం నేరాల కింద సౌదీలో ఈ ఏడాది 214 మంది ఉరి! ఇది కూడా చదవండి: అగ్రస్థానంలో హైదరాబాద్.. ఢిల్లీ, ముంబైని మించి ఆర్థికాభివృద్ధి! #kurnool #daughter #crime #father మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి