సైకిల్ తోసుకుంటూ వెళ్తున్న ఉస్తాద్ హీరో.. 'RAPO 22' ప్రీ లుక్ వైరల్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీ ఫేం మహేశ్ బాబు దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ.. పూజా కార్యక్రమాన్ని నవంబర్ 21న నిర్వహిస్తున్నట్టు తెలిపారు. By Anil Kumar 20 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఉస్తాద్ హీరో రామ్ పోతినేనికి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఎన్నో అంచనాల మధ్య ఇటీవల రిలీజైన 'డబుల్ ఇస్మార్ట్' అట్టర్ ప్లాప్ అయింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం రామ్ భారీగానే కష్టపడ్డాడు. మొదట తీసిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫ్యాన్స్ కూడా 'డబుల్ఇస్మార్ట్' సక్సెస్ అవుతుందని ఆశించారు. కట్ చేస్తే.. సినిమా బెడిసి కొట్టింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని రూటు మార్చి సరికొత్త కథతో రాబోతున్నాడు. రామ్ పోతినేని.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీ ఫేం మహేశ్ బాబు దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ.. పూజా కార్యక్రమాన్ని నవంబర్ 21న నిర్వహిస్తున్నట్టు తెలిపారు. Also Read: అలా చేయొద్దు నాన్న.. అన్నందుకే కూతురిని కడ తేర్చిన తండ్రి! Beginning the beautiful journey of filming Untold Emotions ❤🔥#RAPO22 pooja ceremony on 21st November ✨Stay tuned for exciting updates 💥Starring @ramsayz Written and directed by @filmymahesh Produced by @MythriOfficial pic.twitter.com/3D8e8RsrDW — Mythri Movie Makers (@MythriOfficial) November 19, 2024 Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు? ఈసారి సరికొత్త కథతో.. ప్రీ లుక్ లో రామ్ పోతినేని సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తున్న స్టిల్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే ఇందులో రామ్ లుక్ కూడా మునుపెన్నడూ లేని విధంగా చాల డిఫెరెంట్ గా ఉండబోతుందని ప్రీ లుక్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం RAPO 22 ప్రీ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన ఎవరు కనిపించబోతున్నారన్నది తెలియాల్సి ఉంది. ఇన్నాళ్లు కమర్షియల్ యాక్షన్ మూవీస్ చేసిన రామ్.. ఫస్ట్ టైం సరికొత్త జోనర్ కథతో రాబోతున్నాడు. ఈ ఈ సినిమాతో అయినా ఉస్తాద్ హీరో కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి. Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా Also Read: తెలంగాణలో భారీ చోరీ.. 15 కిలోల బంగారం మాయం #mytri-movie-makers #Rapo22 updates #Rapo22 #ram-pothineni మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి