/rtv/media/media_files/2025/01/31/sLG9XH2LhJuOGgOHiSba.jpg)
Vijayasai Reddy CBI
విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఫ్రాన్స్, నార్వే తదితర దేశాలకు వెళ్లేందుకు
తనకు నెల రోజుల పాటు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి కోరారు. అయితే.. కోర్టు 15 రోజులు మాత్రమే విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10లోపు ఎప్పుడైనా 15 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లొచ్చని తెలిపింది.
ఇది కూడా చదవండి: AP Govt Jobs: 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్!
విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
— Telangana Awaaz (@telanganaawaaz) January 31, 2025
ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు అనుమతించిన కోర్టు..
నెల రోజులు అనుమతి కోరిన విజయసాయిరెడ్డి కోరగా.. 15 రోజులు మాత్రమే అనుమతి..
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10లోపు 15 రోజుల పాటు..
ఎప్పుడైనా విదేశీపర్యటనకు వెళ్లొచ్చన్న సీబీఐ కోర్టు..… pic.twitter.com/Sc7QyMbKtY
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు సంబంధించిన పలు సీబీఐ కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుల్లో జగన్ తో పాటు ఆయన కూడా జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. ఇందుకు సంబంధించిన విచారణ ఇప్పుడు జరుగుతోంది. బెయిల్ నిబంధనల ప్రకారం కోర్టు అనుమతితోనే విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్, నార్వే తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన న్యాయస్థానం విజయసాయిరెడ్డి 15 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
ఇది కూడా చదవండి: ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు.. ఫిబ్రవరి 1 నుంచే అమలు
రాజకీయాలకు దూరం..
వైసీపీలో కీలక నేతగా.. ఓ దశలో నంబర్ 2 గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు ఇక దూరం అవుతున్నానంటూ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. ఇక వ్యవసాయం చేసుకుంటానని ఆయన ప్రకటించారు. అన్నట్లుగా ఫామ్ హౌజ్ లో దిగిన ఫొటోలను ఇటీవల తన X ఖాతాలో షేర్ చేశారు విజయసాయిరెడ్డి.