AP Govt Jobs: 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్!

త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 7నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు.

New Update
Chandrababu Naidu

Chandrababu Naidu

AP Govt Jobs:  ఏపీలో త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని. ఈ పెట్టుబడుల ద్వారా 4,10,125 ఉద్యోగాలు మన యువతకు వస్తాయని స్పష్టం చేశారు. శుక్రవారం ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు.

కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ....
ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను కూటమి అభ్యర్ధులుగా బలపరిచామని చంద్రబాబు వివరించారు. ఫిభ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుంది. 27న ఎన్నికలు, కౌంటింగ్ మార్చి 3న జరుగుతాయి. ప్రతి గ్యాడ్యుయేట్‌ను కలిసి భారీ మెజారిటీ సాధించాలి. చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారన్నారు. ఎవరూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దని సూచించారు. ఎన్డీయే పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పని చేయాలి. క్లస్టర్, యూనిట్, బూత్, ఇంచార్జ్‌లతో పాటు, జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలన్నారు. ఈ ఎన్నికలు ఏపక్షంగా జరగాలి. ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుంది. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందన్నారు.

Also Read :  సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసులకు దొరికిన బిగ్ ప్రూఫ్

మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలి.కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది లేని పాలన సాగిస్తున్నామన్నారు. రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని మనం చెప్పడం లేదు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నాం.  కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌, రాజధాని అమరావతికి ఆర్ధిక సాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్‌తో పాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని బాబు వివరించారు.

Also Read :  ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?

 జాబ్ ఫస్ట్ విధానంతో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చామని, కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ పెట్టుబడుల ద్వారా 4,10,125 ఉద్యోగాలు మన యువతకు వస్తాయన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని.మూడు పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పని చేసినట్లుగానే ఇప్పుడూ అదేవిధంగా పని చేయాలని సూచించారు. జరిగే ప్రతి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్న సీఎం చంద్రబాబు, కూటమికి యూటీఎఫ్ మినహా మిగతా ఉపాధ్యాయ సంఘాల మద్ధతు ఉందని తెలిపారు.

Also Read :  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. రన్నింగ్ లో ఆర్టీసీ బస్సు టైర్ పగలడంతో..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు