/rtv/media/media_files/2025/01/30/j5L3HCMDSrlnSPpPOHsF.jpg)
ap government Photograph: (ap government)
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీల వసూలు సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సవరించిన రిజిస్ట్రేషన్ ఫీజులు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు. మార్కెట్ వ్యాల్యూకు తగ్గంట్టుగా రిజిస్ట్రేషన్ ఫీజులు మార్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో విలువలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఆయా ప్రాంతంలో వ్యాల్యూస్ ను బట్టి ఫీజులు ఉంటాయి.
Also Read: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!
దీంతో ప్రజలు ఫిబ్రవరి 1లోపే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్దకు క్యూ కడుతున్నారు. ఈక్రమంలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద రద్దీ నెలకొంది. ప్రస్తుతం పాత ఫీజుల ప్రకారమే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. టౌన్‌లో ఏడాదికి ఓసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలు, విధానాలు సవరించాలని నిమయం ఉండేది. వైకాపా ప్రభుత్వం ప్రత్యేక రివిజన్ పేరుతో అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్ విలువలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. వీటిపై సమీక్షించిన కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని నిర్ణయం తీసుకుంది.