APPSC Group-1 : గ్రూప్-1 పరీక్ష రద్దు.. జగన్ సర్కార్ కీలక ప్రకటన
2018 గ్రూప్-1 పరీక్షను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విషయంపై జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేసింది.
2018 గ్రూప్-1 పరీక్షను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విషయంపై జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేసింది.
ఏపీలో పెను ప్రమాదం తప్పింది. రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ ఘటన జరిగింది. ట్రైన్ ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
రెండోసారి అధికారం సాధించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ టార్గెట్ గా కసరత్తులు చేస్తోంది. ఉత్తరాంధ్రలో పట్టుసాధిస్తే మెజారిటీ వచ్చినట్టేనని భావిస్తోంది. ఈ క్రమంలో జగన్ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం కానున్నారు.
రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించనుంది జగన్ సర్కార్. విపత్తుల వల్ల నష్టపోయిన సుమారు 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందించనున్నారు. ఇవాళ రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా నగదు జమ చేయనున్నారు.
గతేడాది విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనపై కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు . లోక్‌పైలెట్, సహాయ లోకోపైలెట్లు తమ సెల్ఫోన్లో క్రికెట్ చూస్తూ రైలు నడపడంతోనే రెండు రైళ్లు ఢీకొన్నట్లు తెలిపారు. ఇప్పుడు రైల్వేలో కొత్త భద్రతా చర్యలు తీసుకొచ్చామన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్ల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై విద్యార్హతతో సంబంధం లేకుండా కార్మికులంతా AASకు అర్హులేనని స్పష్టం చేసింది.
టీడీపీ జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్ అన్నారు మంత్రి అంబటి. తాడేపల్లిగూడెం సభలో ప్రజలకు ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కాలంటే.. పవన్‌ను పుట్టించిన వాళ్లు రావాలన్నారు. రాజకీయాల్లో పవన్ ఆటలో అరటి పండులాంటి వాడు అని కౌంటర్లు వేశారు.
బీజేపీతో టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీని 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లలో పోటికి దింపాలని కూటమి పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సీట్ల ఒప్పందంపై త్వరలోనే బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 గంటల నుంచి మ. 1 గంట వరకు ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. మొత్తం 897 పోస్టులకు 4.5 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు.