/rtv/media/media_files/2025/04/19/msld6gCbqHNnoEb4h98s.jpg)
Kasireddy Rajasekhar Reddy
Raj Kasireddy Sensational Audio: ఏపీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.. అయితే, లిక్కర్ స్కాంలో సిట్ అధికారుల నోటీసులపై వివరణ ఇస్తూ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి ఒక ఆడియో సందేశాన్ని పంపారు. పరారీలో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ విడుదల చేసిన ఆడియో సంచలనంగా మారింది.
Also Read: 'ది రాజా సాబ్' ఉన్నట్టా లేనట్టా..? త్వరగా తేల్చండ్రా బాబూ..!
ఈ ఆడియోలో మాట్లాడుతూ... గత కొంతకాలంగా నాపై వస్తున్న తప్పుడు సమాచారం గురించి చెప్పాలని ఆడియో విడుదల చేస్తున్నాను. మార్చిలో సిట్ అధికారులు నేను లేని సమయంలో మా ఇంటికొచ్చి మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. నన్ను విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. నేను 24 గంటల్లోనే సిట్ అధికారులకు స్పందించాను.. నేను విచారణకు వస్తానని చెప్పా.. అయితే, ఎందుకు పిలుస్తున్నారో క్లూ ఇవ్వాలని అడిగా వాళ్ల దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో ఇవ్వాలని అడిగా.. నాకు పూర్తి సమాచారం ఇస్తే విచారణకు వస్తానని చెప్పా.. అయితే, ఈమెయిల్ పెట్టాక నాకు మరోసారి నోటీసులు ఇచ్చారు.. ఈ రోజు నోటీసు ఇచ్చి.. రేపు విచారణకు హాజరుకావాలని సూచించారు..
Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
.
ఇక, నాకు వచ్చిన సిట్ నోటీసులపై నేను నా లాయర్లను సంప్రదించాను.. మిమ్మల్ని ఈ కేసులో సాక్షిగా పిలిచినప్పటికీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని మా లాయర్లు చెప్పారని తెలిపారు రాజ్ కసిరెడ్డి.. అందుకే కోర్టు ద్వారా ప్రొటెక్షన్ తీసుకుని సిట్ విచారణకు హాజరవుతాను అన్నారు. సిట్ నోటీసులపై హైకోర్టుకు వెళ్లానని తెలిపిన ఆయన.. హైకోర్టు కొంత సమయం ఇచ్చి నన్ను పిలవమని చెప్పిందన్నారు.. మరోవైపు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా.. న్యాయపరమైన రక్షణ వచ్చాక విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. ఇక, విజయసాయిరెడ్డి కామెంట్లపై స్పందిచిన కసిరెడ్డి.. న్యాయపరమైన వ్యవహారాలు ముగిశాక విజయసాయిరెడ్డి బాగోతం బయటపెడతానని పేర్కొన్నారు కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి. విజయసాయి తీరు, చరిత్ర, నిజాలు త్వరలో బయటపెడుతా అంటూ ఆడియో విడుదలచేశారు.
Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!