/rtv/media/media_files/2025/03/03/viIdCKcvXJoN4VjuUgzx.jpg)
AP MLC 2025
AP MLC: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి డాక్టర్ గాదె శ్రీనివాసులు గెలుపొందారు. కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మపై రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు.
కొనసాగుతున్న కౌటింగ్..
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి డాక్టర్ గాదె శ్రీనివాసులు గెలుపొందారు. కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మపై రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. ఇక కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసే సరికి ఆయన 20,746 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో కూటమి అభ్యర్థి ఆలపాటికి 17,246 ఓట్లు, రెండో రౌండ్‌లో 17,506 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు తొలి రౌండ్‌లో 7,156, రెండో రౌండ్‌లో 6,710 ఓట్లు పడ్డాయి. రెండు రౌండ్లు ముగిసేసరికి ఆలపాటి రాజా 20,746 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
Follow Us