సీక్రెట్‌ క్యాంప్ లో భారత్ ప్రాక్టీస్.. వాటిపై నిషేధం విధించిన బోర్డ్

న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిన భారత్ ఆసీస్ తో సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ జరగనుండగా WACA మైదానంలో సీక్రెట్‌ క్యాంప్ ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ వీడియోలు బయటకు రాకుండా బోర్డ్ జాగ్రత్తలు తీసుకుంది.

author-image
By srinivas
New Update
erer

Ins Vs Aus: న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమి మూటగట్టుకున్న భారత్ ఆసీస్ తో సమరానికి సిద్ధమవుతోంది. 5 టెస్టుల సిరీస్‌ లో భాగంగా నవంబర్ 22 నుంచి ఇరుజట్ల మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రారంభంకానుండగా.. టీమ్ ఇండియా ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే మొదటి టెస్ట్ పెర్త్ వేదికగా జరగనుండగా ఇది పూర్తి బౌన్స్ పిచ్ కావడంతో భారత్ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేసుకుంది. పెర్త్‌లోని పాత టెస్ట్ వేదిక అయిన WACA మైదానంలో సీక్రెట్‌ క్యాంప్ ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ప్రాక్టీస్ సెషన్స్‌ పాల్గొన్నప్పుడు బయటి వ్యక్తులు ఫొటోలు, వీడియోలు తీయకుండా నెట్స్‌తో కవర్‌ చేశారు. సిబ్బంది సైతం మొబైల్స్‌ వాడకూడదని బీసీసీఐ సూచించినట్లు సమాచారం. కాగా  కొంతమంది దొంగచాటున ఫొటో, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 

ఎప్పటిలానే పెర్త్ లో బౌన్సీ పిచ్‌..

ఇక ఫస్ట్ బ్యాటింగ్ సెషన్‌లో విరాట్ కోహ్లీ పాల్గొనపోగా.. యశస్వి జైస్వాల్, రిషభ్‌ పంత్ ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. వీరిద్దరూ కొన్ని పెద్ద షాట్లు ఆడారు. జైస్వాల్ కొట్టిన ఓ షాట్‌కు బంతి పక్కనే ఉన్న రహదారిపై పడటం వివేషం. కాగా ఎప్పటిలానే పెర్త్ లో బౌన్సీ పిచ్‌ను రూపొందించినట్లు ఆప్టస్ స్టేడియం హెడ్ క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ తెలిపారు. అయితే ప్రస్తుతం భారత జట్టు సాధన చేస్తున్న WACA మైదానంలోని పిచ్‌లు పేస్, బౌన్స్‌కు అనుకూలిస్తాయి. ఈ కారణంలోతోనే అక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టింది భారత్. 

ఆస్ట్రేలియాలో భారత్ హ్యాట్రిక్ పక్కా..

ఇదిలా ఉంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సాధించి ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ సాధిస్తుందని భారత మాజీ చీఫ్‌ సెలక్టర్ చేతన్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌ ఆస్ట్రేలియాలో విజయం సాధిస్తుందని తనకు 100 శాతం నమ్మకం ఉందన్నాడు. ఎందుకంటే బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో గత నాలుగు సిరీస్‌ల్లో టీమ్‌ఇండియా నే విజేతగా నిలిచిందని గుర్తు చేశాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు