BY Poll: రేపు వాయనాడ్‌తో పాటూ 31 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు

రేపు వాయనాడ్‌ ఉప ఎన్నికతో పాటూ 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో సిక్కింలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ లేదు.

author-image
By Manogna alamuru
New Update
13

By Poll Elections: 

మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్ఎస్ నేత రాహుల్ గాంధీ వాయనాడ్, రాయబరేలీ రెండింటి నుంచీ పోటీ చేసి గెలియారు. తరువాత ఒక స్థానాన్‌ని వదులుకోవాల్సి రావడంతో వాయనాడ్‌ను విడిచిపెట్టారు. దీంతో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అగత్యం ఏర్పడింది. రేపు వాయనాడ్‌లో ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వయనాడ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారు. తొలిసారి ప్రియాంక ఎన్నికల రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారానికే పరిమితమైన ప్రియాంక ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక మరోవైపు బీజేపీ.. నవ్య హరిదాస్‌ అనే  కీలక నేతను రంగంలోకి దించింది. ఈమెకు కేరళలో మంచి పేరుంది. దీంతో వాయనాడ్ లో పోటీ రసవత్తరంగా మారింది. ప్రియాంక వర్సెస్ నవ్య అన్నట్టుగా పోటీ నెలకొంది. అయితే వాయనాడ్ ప్రజలు ఎవరికి పట్ట కడతారో చూడాలి. 

ఇక వాయనాడ్‌తో పాటూ మరో 31 అసెంబ్లీ నియోజకవర్గల్లో కూడా రేపే పోలింగ్ జరగుతోంది. ఇందులో సిక్కింలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ లేదు. మిగతా అన్నింటిలో యధావిధిగా ఓటింగ్ నిర్వహిస్తారు. అన్ని స్థానల్లో ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల చేస్తారు. 

31 అసెంబ్లీ స్థానాలు ఇవే..

అస్సాం: ధోలై, సిడ్లీ, బొంగైగావ్, బెహాలి, సమగురి
బీహార్: తరారీ, రామ్‌గఢ్, ఇమామ్‌గంజ్, బెలగంజ్
ఛత్తీస్‌గఢ్: దక్షిణ రాయ్‌పూర్ నగరం
గుజరాత్: వావ్
కర్ణాటక: షిగ్గావ్, సండూర్, చన్నపట్న
కేరళ: చెలక్కర
మధ్యప్రదేశ్: బుధ్ని, విజయ్‌పూర్
మేఘాలయ: గ్రామ్‌బేఘాలయ
రాజస్తాన్: జుంఝును, రామ్‌ఘర్, దౌసా, డియోలీ-ఉనియారా, ఖిన్వ్సర్, సాలంబెర్, చోరాసి
పశ్చిమ బెంగాల్: సితాయ్, మదారిహత్, నైహతి, హరోవా, మేదినీపూర్, తల్దంగ్రా

Also Read: Jharkhand: రేపే జార్ఖండ్ తొలి విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు