వచ్చే ఏడాది నుంచి ప్రవేశ పరీక్షల్లో మార్పులు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

వచ్చే జనవరి నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షల్లో పలు సంస్కరణలు తీసుకురానున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రానికి తప్పకుండా సహకారం అందించాలని కోరారు.

New Update
Exam

2025 జనవరి నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షల్లో పలు సంస్కరణలు రానున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌లో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రానికి తప్పకుండా సహకారం అందించాలని కోరారు. '' అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త ప్రవేశ పరీక్షల సిరీస్‌ రాబోతుంది. 

Also Read: మీ తల్లిని చంపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

గత ఏడాదిలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నాం. అందుకే ఈసారి కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని'' ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఉన్నత, సాంకేతిక విద్యపై జరిగిన నేషనల్ వర్క్‌షాప్‌ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. పరీక్షల్లో ఎలాంటి లోపాలు లేకుండా ప్రవేశ పరీక్షలు నిర్వహించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాధ్యత అని గుర్తుచేశారు.

Also Read: మీ తల్లిని చంపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో సంస్కరణలకు సంబంధించి కె. రాధాకృష్ణన్ కమిటీ తన నివేదికను సమర్పించిందని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ సిఫార్సులు అమలు చేసేందుకు రాష్ట్రాల నుంచి సహకారం తప్పకుండా ఉండాలన్నారు. ఇటీవల నీట్, నెట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంస్కరించేందుకు కె.రాధకృష్ణన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల ఆధారంగానే ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

Also Read: పంజాబ్‌లో కాలుష్యం.. 18 లక్షల మంది ఆస్పత్రిపాలు

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. CISFలో పూర్తిస్థాయి మహిళల రిజర్వ్ బెటాలియన్‌

 

Advertisment
Advertisment
తాజా కథనాలు