NBK 109 : బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. 'NBK 109' టీజర్ లోడింగ్

'NBK 109' టైటిల్, టీజర్ రిలీజ్ డేట్ రివీల్ చేశారు మేకర్స్. నవంబర్ 15వ తేదీ ఉదయం 10:24 గంటలకి టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ విషయానికి తెలుపుతూ బాలయ్యబాబు కత్తి, గన్ పట్టుకున్న పవర్ఫుల్ పోస్టర్ ని షేర్ చేశారు.

New Update
dsfd

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'NBK 109'. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినపోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ మూవీ అంచనాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Also Read :  డాక్టర్ తో డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్

ఇలాంటి తరుణంలో మూవీ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 'NBK 109'  టైటిల్ అలాగే టీజర్ రిలీజ్ డేట్ రివీల్ చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 15వ తేదీ ఉదయం 10:24 గంటలకి టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ విషయానికి తెలుపుతూ బాలయ్యబాబు కత్తి, గన్ పట్టుకున్న పవర్ఫుల్ పోస్టర్ ని షేర్ చేశారు. ఈ పోస్టర్ కాస్త సినిమాపై ఆసక్తిని పెంచింది. 

Also Read : రీమేక్ వద్దని చెప్తే వినలేదు.. వాటి మీదైనా దృష్టి పెట్టుంటే హిట్ అయ్యేదేమో

బాలయ్య కూడా సంక్రాంతికే..

అలాగే ఈ పోస్టర్ లో సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు చెప్పేశారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో రామ్ చరణ్ 'గేమ్ చేంజర్', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు కన్ఫర్మ్ అవ్వగా.. ఇప్పుడు బాలయ్య కూడా ఈ రేసులో ఉండబోతున్నాడు. దీంతో వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర భారీ బిగ్గెస్ట్ ఫైట్ ఉండబోతుంది. 

Also Read : కంగనా రనౌత్‌కు బిగ్ షాక్‌.. కోర్టు నోటీసులు

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా, తెలుగమ్మాయి చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Also Read : అంధుడి పాటకు సజ్జనార్ ఫిదా.. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ కీరవాణికి రిక్వెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు