జగన్ అరెస్ట్! | Tirupati Laddu Adulterated Case Updates | CM Chandrababu | YS Jagan | TTD | RTV
తిరుమల పవిత్రత దెబ్బతిసేలా సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశాడని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతువు కొవ్వు కలిసినట్లు CBI సిట్ రిమాండ్లో చెప్పలేదన్నారు. అయినా చంద్రబాబు, పవన్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారన్నారు.
తిరుపతి లడ్డూ వివాదం వేళ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ డిక్లరేషన్ ఫామ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్యమతస్థుడైన షారుఖ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకున్నారని, క్రైస్తవుడైన జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు రావాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం ఎఫెక్ట్ యూపీలోని పలు ఆలయాలకు తాకింది. పురాతన పద్ధతుల్లో ప్రసాదాలు చేయాలని మధురలోని ధర్మ రక్షా సంఘం నిర్ణయం తీసుకుంది. పండ్లు తదితర సహజసిద్ధమైన పదార్థాలతో ప్రసాదం తయారు చేయాలని పలు ఆలయాల నిర్వాహకులు నిర్ణయించారు.
మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ వివాదం, తిరుపతిలో పోలీసుల ఆంక్షలు, వైసీపీ నేతల ముందస్తు అరెస్టుల నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.