AP News: తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు తాడిపత్రికి రానుండటంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.  సుమారు 15 నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.

New Update
Pedda Reddy vs JC Prabhakar Reddy

Pedda Reddy vs JC Prabhakar Reddy

 AP News: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు తాడిపత్రికి రానుండటంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.  సుమారు 15 నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఈ సంద‌ర్భంగా తాడిపత్రి నియోజ‌క వ‌ర్గం తిమ్మంపల్లిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దారెడ్డి ప్రత్యేక పూజలు చేయ‌నున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రికి పెద్దారెడ్డి బ‌య‌లు దేరారు. అయితే… మాజీ ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డి వ‌స్తున్న నేప‌థ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా పోటీగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ సీనియ‌ర్ నేత‌ జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశాన్ని రద్దు చేసుకున్నాడు. సుప్రీంకోర్టు ఆదేశాలు పెద్దారెడ్డికి రూట్ క్లియర్ చేసినా, గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఇంకా సాఫీగా లేదు. దీంతో జిల్లా ఎస్పీ జగదీష్ రంగంలోకి దిగారు. 


ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అంతేకాక, ఆయనే స్వయంగా తాడిపత్రికి వెళ్లి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తాడిపత్రి వైపు వెళ్ళే రహదారులన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దారెడ్డి ఇవాళ ఉదయం 9 గంటలకు తిమ్మంపల్లి నుంచి బయలుదేరి తాడిపత్రికి చేరుకోవాల్సి ఉంది. కానీ మరోవైపు జేసీ ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు – ఎంత మంది వచ్చినా, ఎవరు చెప్పినా తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వమని గట్టిగా వార్నింగ్‌ ఇస్తున్నారు. దీంతో  పెద్దారెడ్డి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాడిపత్రిలోకి అడుగుపెడతారా? లేక మరోసారి గట్టి ప్రతిఘటన ఎదుర్కొంటారా? కొన్ని గంటల్లోనే తేలనుంది. ఒకవేళ జేసీ రాజకీయ ప్రతాపం ముందు పోలీసులు తలొగ్గి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయకపోతే, న్యాయస్థానం చీవ‌ట్లు తినాల్సి వస్తుంది. కూట‌మి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా స్థాయి అధికారుల నుండి చిన్న అధికారుల వరకూ అంద‌రిని పబ్లిక్‌గా బెదిరింపులు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాట్లాడే ధైర్యం ఎవరూ చేయడం లేదు. దీంతో ఆయన రాజ్యమే తాడిపత్రిలో నడుస్తుందనే ఆరోపణలు వినవస్తు్న్నాయి.

ఈ నేపథ్యంలో తాడిపత్రి వెళ్లటంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి మాట్లాడుతూ..‘15 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్లటం ఆనందంగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పించారు. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తాను.  తాడిపత్రి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తాను. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తాను’ అని చెప్పుకొచ్చారు.  ఇదిలా ఉండగా.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొంతకాలంగా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’ అని పోలీసులను కోర్టు ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలతో పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ దిగి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్‌ లేఖ రాశారు. ఈ లేఖలో పెద్దారెడ్డికి పోలీసు భద్రత కల్పిస్తామని, అందుకు అయ్యే ఖర్చు వివరాలను ఇస్తామని.. అది డిపాజిట్ చేయాలని ఎస్పీ  తెలిపారు. దీనికి కేతిరెడ్డి పెద్దారెడ్డి అంగీకారం తెలిపారు.  

ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!

Advertisment
తాజా కథనాలు