/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t135038230-2025-11-04-13-51-16.jpg)
Teacher who pressed legs with girls
AP: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్ళు నొక్కించుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసింది. ఉపాధ్యాయురాలు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్ళు నొక్కించుకుంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు ఇచ్చి.. విచారణకు ఆదేశించారు.
బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ దర్జాగా కూర్చీలో కూర్చొని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ టైమ్‌పాస్ చేసింది. అంతేకాదు, ఏకంగా పిల్లలతో కాళ్లు నొక్కించుకుంటూ విద్యార్థులపై తన జులూం ప్రదర్శించింది. అయితే, అందుకు సంబంధించిన మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీచర్ పాఠాలు చెప్పకుండా బాలికలతో కాళ్లు నొక్కించుకున్న వీడియోలు వైరల్‌గా మారాయి. క్లాస్ రూంలో ఫోన్ మాట్లాడుతూ...టీచర్ సుజాత చిన్నారులతో చాకిరి చేయించుకుంది. బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.సోషల్ మీడియాలో టీచర్ వికృత చేష్టలు వైరల్ అవుతున్నాయి. టీచర్ సుజాత తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ల అయ్యారు.టీచర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా-- ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. సుజాతకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు విచారణకు ఆదేశించారు.
Also Read : టీమిండియా జట్టులో నో ప్లేస్.. కానీ ఫైనల్ మ్యాచ్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మ్యాచ్ ఆఫ్ ది ప్లేయర్
Follow Us