Talliki Vandanam Guidelines: రేషన్ కార్డు మస్ట్.. కారు ఉంటే రాదు - తల్లికి వందనం గైడ్‌లైన్స్

ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. దాని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. రైస్ కార్డు తప్పనిసరి. ఫోర్ వీలర్ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రాదు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 75శాతం హాజరు ఉండాలి.

New Update
Talliki Vandanam Guidelines

Talliki Vandanam Guidelines

Talliki Vandanam Guidelines

  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10,000 మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12,000 మించకూడదు.
  • కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి రైస్ కార్డు ఉండాలి.
  • కుటుంబం మొత్తానికి తడి భూమి 3 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. లేదా 10 ఎకరాల కంటే తక్కువ పొడి భూమి ఉండాలి.. లేదా రెండూ కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 
  • ఇంటి సభ్యులలో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయింపు ఇచ్చారు. 
  • నెలకు విద్యుత్ వాడకం సంవత్సరానికి సగటున 300 యూనిట్లు మించకూడదు

Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !

  • లబ్దిదారుని కుటుంబానికి 1000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో మున్సిపల్ ఆస్తి ఉండకూడదు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో జాబ్ చేస్తున్న వారి పిల్లలు ఈ పథకానికి అనర్హులు.
  • ప్రభుత్వ పింఛన్‌ (రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి) తీసుకునే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనర్హులు. పారిశుధ్య కార్మికులకు మినహాయింపు ఉంది.  
  • ఒక కుటుంబంలోని ఎవరైనా సభ్యుడు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే.. ఆ కుటుంబం అర్హులు కాదు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో లబ్ధిదారుడిని చేర్చి ఉండాలి. ఒకవేళ లబ్ధిదారుడు హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో లేకపోయినా.. పిల్లవాడు డేటాబేస్‌లో ఉంటే లబ్ధిదారుడిని మ్యాప్ చేయడానికి GSWS విభాగం ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించాలి.

Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!

  • లబ్ధిదారుడి పిల్లలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ/ప్రైవేట్ ఎయిడెడ్/ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు/జూనియర్ కళాశాలల్లో ITI/పాలిటెక్నిక్/IIIT (RGUKT), ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ప్రయోజనం పొందే ఇతర కోర్సులను ఎంచుకునే విద్యార్థులను పరిగణనలోకి తీసుకోరు.
  • స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో చేరిన అనాథలు, వీధి పిల్లలు సంబంధిత శాఖతో నిర్ధారణకు లోబడి ఈ ప్రయోజనం పొందడానికి అర్హులు. 

Also Read : టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

  • విద్యార్థి తల్లి అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి. తల్లి బ్యాంక్ ఖాతా NPCI తో లింక్ చేసుకోవాలి. 
  • ఈ విద్యా సంవత్సరంలో 75% హాజరు ఉన్న విద్యార్థి నెక్స్ట్ ఇయర్‌కి ఆర్థిక సహాయం పొందుతారు. ఒకవేళ చదువును ఆపివేసినా లేదా ఆ విద్యా సంవత్సరంలో 75% హాజరు లేకపోయినా అర్హులు కారు.
  • 2025-26 విద్యా సంవత్సరానికి నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నమోదు చేసుకున్న విద్యార్థులను ఆర్థిక సహాయం కోసం పరిగణనలోకి తీసుకుంటారు.

Advertisment
తాజా కథనాలు